Share News

గణపతి బప్పా మోరియా

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:34 AM

కర్నూలు నగరంలో 9 రోజులపాటు పూజలందుకున్న గణనాథుడు మంగళవారం నిమజ్జనానికి తరలివెళ్లాడు.

గణపతి బప్పా మోరియా
నిమజ్జనానికి తరలివెళ్తున్న గణనాథులు

నగరంలో 2వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం

యువత నృత్యాల జోరు.. డీజేల హోరు

భక్తులతో నిండిపోయిన నగర ప్రధాన రోడ్లు

కర్నూలు కల్చరల్‌/ న్యూసిటీ/ రూరల్‌/ కల్లూరు/ ఓర్వకల్లు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలో 9 రోజులపాటు పూజలందుకున్న గణనాథుడు మంగళవారం నిమజ్జనానికి తరలివెళ్లాడు. వాహనాల మీద ఆశీనుడైన గణనాథుడి ఊరేగింపు ఎదుట పిల్లలు, పెద్దలు ఆనందంతో చిందులు వేశారు. చిన్నా, పెద్ద విగ్ర హాలు కలిపి సుమారు 2 వేల విగ్రహాలను ప్రతిష్ఠించగా, నగరంలో వినాయక ఘాట్‌తో పాటూ నన్నూరు టోల్‌గేట్‌, ఉలిందకొండ హెచఎనఎస్‌ఎస్‌ కాలువలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. నగరపాలక సంస్థ అధి కారులు భారీ క్రేనలను విగ్రహాల నిమజ్జనా నికి ఏర్పాటు చేశారు. గణేశ నవరాత్రి ఉత్సవాల్లో పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఫ వినాయక ఘాట్‌లో ఊరేగింపుగా తీసుకువచ్చిన గణేశ విగ్రహాలను నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత ఘా ట్‌కు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్ర మాలను ప్రారంభించారు. భరతమాత, బాల గంగాధర తిలక్‌ చిత్రపటాలకు పూలమాల లు వేశారు. ఘాట్‌ను పరిశీలించి గణేశ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులతో మాట్లాడారు. రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ హాజరై వేడుకల పతాకాన్ని ఎగుర వేశారు. అనంతరం లాంఛనంగా విగ్రహాల నిమజ్జనాన్ని ప్రారంభించారు. టీజీ వెంకటేశ సతీమణి టీజీ రాజ్యలక్ష్మి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, గణేశ ఉత్సవ సమితి రాష్ట్ర గౌర వాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు పాల్గొ న్నారు. గోకరాజు గంగరాజు మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కూడా విజయ వంతంగా నిర్వహించడానికి టీజీ వెంకటేశ, మంత్రి టీజీ భరత చేసిన కృషి అభినందనీ యమన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ నరెడ్డి, గణేశ మహోత్సవ కేంద్ర సమితి రాష్ట్ర కార్యదర్శి గోరంట్ల రమణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.వేణుగోపాల్‌, డాక్టర్‌ ఎం. నాగఫణిశాసి్త్ర, జిల్లా, నగర అధ్యక్ష, కార్యద ర్శులు ఎస్‌ రంగస్వామి, వర్మ, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

ఫ కేసీ కెనాల్‌ ఘాట్‌ వద్ద సంస్కార భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృ తిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థుల కు అతిథులు జ్ఞాపికలు, ప్రశంసాపాత్రాలు అందజేశారు.

ఫ భక్తులకు అసౌకర్యం కలగకుండా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రాంబోట్ల దేవాలయం నుంచి వినాయక ఘాట్‌ వరకు ఎనిమిది తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు.

ఫ వినాయక ఘాట్‌లో గణేశ మూర్తుల నిమజ్జనం ఘనంగా ప్రారంభమైంది. ఇరిగే షన ఎస్‌ఈలు రాజనబాబు, శైలేశ్వర్‌, ఈఈ ప్రసాదరావు హెచఎనఎస్‌ఎస్‌ కాలువల వద్ద ఉంటూ ఏర్పాట్లు పర్యవేక్షించారు. నగర పాలక సంస్థ అధికారులు కూడా క్రేన్లు ఏర్పాట్లు చేశారు. కేసీ కెనాల్‌ వినాయక ఘా ట్‌తోపాటూ నన్నూరు టోల్‌ప్లాజా, ఉల్లింద కొండ ప్రాంతాల్లో హంద్రీనీవా కాలువల వద్ద ఏర్పాట్లను మంత్రి టీజీ భరత పరి శీలించి, అధికారులకు సూచనలిచ్చారు.

ఫ పాతనగరం నుంచి వినాయక ఘాట్‌ వరకు వివిధ ప్రాంతాల్లో పలు స్వచ్ఛంద సే వా సంస్థల ప్రతినిధులు అన్నదానం, అల్పా హారం పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఫ నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సండేల్‌ చంద్రశేఖర్‌ అంబేద్కర్‌ భవన వద్ద స్వంత ఖర్చులతో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. కేసీ వినాయక ఘాట్‌లో నీటి పరిశుభ్రతకు విగ్రహాలకు వేసిన పూజా ద్రవ్యాలను నగరపాలక పారిశుధ్య సిబ్బంది గట్టునే సేకరించి, కేవలం విగ్రహాన్ని మాత్ర మే నిమజ్జనానికి తరలించారు.

ఫ కేసీ కెనాల్‌ వినాయక ఘాట్‌లో నిమ జ్జనం కార్యక్రమం మధ్యాన్నం రెండు గంట లకు ప్రారంభించాల్సి ఉండగా అతిథుల రాక ఆలస్యం కావడంతో మధ్యాహ్నం మూడు న్నర గంటలకు నిమజ్జనోత్సవాన్ని మొదలు పెట్టారు.

ఫ ప్రధాన రహదారుల్లో ద్విచక్ర వాహ నాలు, ప్రభుత్వ వాహనాలు మినహా ఇతర వాహనాలను పోలీసులు అనుమతించలేదు. దీంతో రోడ్లన్నీ భక్తులతో నిండిపోయాయి.

ఫ సాయంత్రం రాజ్‌విహార్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు దారికి అటూ ఇటూ భక్తులు ఫ్లాట్‌ ఫారాలు, రోడ్‌ డివైడర్లపై కూర్చొని వినాయక విగ్రహాలను తిలకిస్తూ పరవశించి పోయారు.

ఫ వినాయక ఘాట్‌ వద్ద రోడ్డుకు అటూ, ఇటూ తిరునాళ్లను తలపించేలా పిల్లలను ఆకర్షించే విభిన్న రకాల బొమ్మలతో వ్యాపా రులు స్టాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. పిల్లలు ముఖాలకు పెట్టుకునే మాస్కులు, టోపీలు, బెలూన్లు ఆకర్షణీయంగా కనిపించాయి.

ఫ రాత్రి 8 గంటలకు నగరంలో వర్షం ప్రారంభమైంది. సుమారు అరగంట పాటూ వర్షం కొనసాగింది. ఈ వర్షంలోనే భక్తులు ఉత్సాహంగా తడుస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.

ఫ నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది ప్రతిష్ఠించిన 8 అడుగుల మట్టి విగ్రహన్ని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ఈసందర్భంగా కమిషనర్‌ చల్లా ఓబులేసు పూజలు నిర్వహించారు. వినాయక విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన లడ్డూను కాంట్రాక్టర్‌ మనోహర్‌రెడ్డి రూ.,101,116కు దక్కించుకు న్నారు. కండువాలను అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ రూ.25 వేలకు, చెరుకు గడ లను అకౌంట్స్‌ ఆఫీసర్‌ రఘునందన రూ.7200కి దక్కించుకున్నారు.

ఫ జిల్లా పరిషత పరిపాలన ఆవరణలో జడ్పీ, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఎం పీడీవో శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న వినాయక విగ్రహానికి జడ్పీ చైర్మన ఎర్ర బోతుల పాపిరెడ్డి, సీఈవో ఆర్‌.సుధాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బారెడ్డిలు పూజ లు నిర్వహించారు. ఆవాజ్‌ కమిటీ అధ్వ ర్య ంలో భక్తులకు తాగునీరు పంపిణీ చేశారు.

ఫ కర్నూలు రూరల్‌ మండలంలో వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహిం చారు. బి.తాండ్రపాడు గ్రామ శివారులో ఉన్న హంద్రీనీవా కాలువలో మంగళవారం విగ్రహాలను నిమజ్జనం చేశారు. కోడు మూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిఽథిగా హాజరై గణేష్‌ నిమజ్జనాన్ని ప్రారం భించారు.

ఫ కల్లూరు అర్బనలో మంగళవారం వినాయక విగ్రహాలకు మండప కమిటీ సభ్యులు పూజలు చేసి లడ్డూవేలం పాటలు నిర్వహించారు. అనంతరం విగ్రహాలను వీధుల గుండా ఊరేగించి కాలువల్లో నిమ జ్జనం చేశారు. కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉలిందకొండ సమీపంలోని హెచఎనఎస్‌ఎస్‌ కాలువ వద్ద రెండు క్రేన్లు ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ, రెవె న్యూ, పోలీసు అధికారుల సమక్షంలో భక్తు లు గణనాథులను నిమజ్జనం చేశారు.

ఫ ఓర్వకల్లు మండలం సోమయాజు లపల్లెలో గణేశ నిమజ్జనం ఘనంగా జరి గింది. గణనాథులను ఊరేగింపుగా తీసుకెళ్లి కొమ్ముచెరువు సమీపంలో నీటిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఆకుల రాజేశ, శ్రీపతి ప్రసాద్‌, శ్రీరాములు, సుబ్రహ్మణ్యం, సుబ్బ రాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2026 | 12:34 AM