Share News

గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Feb 10 , 2026 | 12:19 AM

పట్టణ శివారులోని బనగానపల్లె రహదారిలో ఉన్న జగనన్న కాలనీ సమీపంలో సోమవారం సాయంత్రం ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్టు
నిందితులతో సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ రమేష్‌ బాబు

బేతంచెర్ల, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): పట్టణ శివారులోని బనగానపల్లె రహదారిలో ఉన్న జగనన్న కాలనీ సమీపంలో సోమవారం సాయంత్రం ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలివీ.. నంద్యాల పట్టణానికి చెందిన మనోజ్‌కుమార్‌, బేతంచెర్ల మండలం గోర్లగుట్ట గ్రామానికి చెందిన రత్న కుమార్‌, బండి ఆత్మకూర్‌ మండలం లింగాపురం గ్రామానికి చెందిన గుర్రాల రామన్నను బేతంచెర్ల ఊరి బయట ఉన్న జగనన్న కాలనీ వెనకాల చెట్ల పొదల వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్‌ మారుతి, వీఆర్‌వోలు సురేంద్ర బాబు, విజయలక్ష్మి సమక్షంలో అరెస్ట్‌ చేసి నిందితుల వద్ద నుండి 3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో వీరికి గంజాయి సప్లై చేసిన నంద్యాల పట్టణానికి చెందిన మహబూబ్‌ బాషా అలియాస్‌ మరాఠి పరారీలో ఉన్నాడని ఆయన తెలిపారు. గంజాయి నిందితున్ని పట్టుకునేందుకు స్పెషల్‌ పోలీస్‌ టీమ్‌ను నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ రమేష్‌ బాబు, కానిస్టేబుళ్లు సురేశ్‌, గురు బాబు, రాజు నాయక్‌, సూర్య రామరాజు, వెంకటేస్‌ లు పాల్గొన్నారు. మండలంలో ఎక్కడ గంజాయి గురించి సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

Updated Date - Feb 10 , 2026 | 12:19 AM