గంజాయి ధ్వంసం
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:23 AM
జిల్లా పరిధిలోని 12 పోలీ్‌సస్టేషన్లలో 15 గంజాయి కేసుల్లో పట్టుబడిన 30.276 కేజీల గంజాయిని గురువారం మాదకద్రవ్య నిర్మూలన కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ సునీల్ షెరాన్, డ్రగ్ డిస్పోజల్ కమిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎక్సైజ్, పంచాయితీ శాఖల ఆఽధ్వర్యంలో గంజాయిని శాస్త్రీయ పద్దతిలో ధ్వంసం చేసి దహనం చేశారు.
గడివేముల/నంద్యాల క్రైం, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలోని 12 పోలీ్‌సస్టేషన్లలో 15 గంజాయి కేసుల్లో పట్టుబడిన 30.276 కేజీల గంజాయిని గురువారం మాదకద్రవ్య నిర్మూలన కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ సునీల్ షెరాన్, డ్రగ్ డిస్పోజల్ కమిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎక్సైజ్, పంచాయితీ శాఖల ఆఽధ్వర్యంలో గంజాయిని శాస్త్రీయ పద్దతిలో ధ్వంసం చేసి దహనం చేశారు. గడివేముల మండలంలోని జేఎస్‌డబ్ల్యు సిమెంట్ లిమిటెడ్ లోని నిర్దేశిత మెషినరీలో అధికారుల పర్యవేక్షణలో గంజాయిని దహనం చేసి నాశనం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాలు అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతుందన్నారు. అడిషనల్ ఎస్పీ ఖాదర్‌బాషా, ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, పాణ్యం సీఐ కిరణ్‌కమార్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు కిశోర్‌రెడ్డి పాల్గొన్నారు.