గాంధీ జీవితం అందరికీ ఆదర్శం
ABN , Publish Date - Oct 02 , 2026 | 11:11 PM
సమాజానికి మంచి విలువలు అందించిన మహాత్మాగాంధీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
నంద్యాల రూరల్, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): సమాజానికి మంచి విలువలు అందించిన మహాత్మాగాంధీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం పటణంలోని గాంధీ చౌక్ వద్ద విగ్రహానికి మంత్రితో పాటు కలెక్టర్ రాజకుమారి పూలమాల వేసి నివాళి అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మాగాందీ, లాల్ బహదూర్‌శాస్ర్తి ఆశయాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. సత్యం, శాంతి, అహింసతో గాంధీ స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించారన్నారు. సీఎం చంద్రబాబు రాయలసీమ అభివృద్ధికి, ఉద్యానవన రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. బంగినపల్లి మామిడి వంటి ప్రాంతీయ ఉద్యాన ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు అనుసంధానించేలా ముందుకు రావాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ క్విట్ ఇండియా, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన వంటి ఉద్యమాల ద్వారా ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా అహింసాయుత పోరాటాన్ని బలోపేతం చేశారని అన్నారు. లాల్ బహదూర్ శాస్ర్తి ఇండో- పాక్ యుద్ధ సమయంలో చూపిన సమయస్ఫూర్తి, నాయకత్వాన్ని కొనియడారు. ఆయన నిజాయితీ, నిరాడంబరత, దేశభక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. నేటి, భవిష్యత్తు తరాలు మహనీయులను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.