ఐదు కిలోల గంజాయి పట్టివేత
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:00 AM
నందవరం మండలంలో ఐదు కిలోల గంజాయిని ఎమ్మిగనూరు పోలీసులు దాడులు చేసి సీజ్ చేయడంతో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ చిరంజీవి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఆరుగురు నిందితుల అరెస్టు, ఆటో సీజ్ త
ఎమ్మిగనూరు, జూన్ 10(ఆంధ్రజ్యోతి): నందవరం మండలంలో ఐదు కిలోల గంజాయిని ఎమ్మిగనూరు పోలీసులు దాడులు చేసి సీజ్ చేయడంతో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ చిరంజీవి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నందవరం మండలం మిట్టసోంపురం గ్రామానికి చెందిన బెస్త తిప్పన్న, ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన షేక్ షాషావలి, షేక్ చాంద్ బాష, వడ్డె భీమే్‌షలు నాగలదిన్నె శివారులో గంజాయిని కొనుగోలు చేసి విక్రయించేందుకు ఆటోలో తరలించేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి వారి నుంచి మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల సమాచారంతో పెద్దకొత్తిలి గ్రామ శివారులో ఉన్న భంభం ఆశ్రమం దగ్గర గంజాయి పండించి ఆరబెట్టి వ్యాపారం చేసే చాకలి రాముడు, చాకలి నాగార్జునలను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ వారి నుంచి 2.300 కిలోల గంజాయిని సీజ్ చేశారు. మొత్తం 5.300 కిలోల గంజాయితో పాటు ఆరుగురిని అరెస్టు చేసి ఓ ఆటోను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడుల్లో నందవరం హెసీలు కోదండరామి రెడ్డి, సుభాన్, పీసీలు వీరేష్, భాస్కర్, వెంకటేష్, సుధాకర్, నందవరం డీటీ మహెష్, ఏఓ సుగాలి సరిత, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు శ్రీనివాసులు, తిమ్మారెడ్డి పాల్గొన్నారు.