వృత్తి నైపుణ్యాలే ప్రగతికి పునాది
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:01 AM
వృత్తి నైపుణ్యాలే ప్రగతికి పునాది వంటివని రాయలసీమ యూనివర్సిటీ(ఆర్యూ) వీసీ వెంకట బసవరావు అన్నారు. గురువారం ఆర్యూలోని సెనేట్ హాలుల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన బోధనేతర సిబ్బందికి శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు
కర్నూలు అర్బన్ ,అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): వృత్తి నైపుణ్యాలే ప్రగతికి పునాది వంటివని రాయలసీమ యూనివర్సిటీ(ఆర్యూ) వీసీ వెంకట బసవరావు అన్నారు. గురువారం ఆర్యూలోని సెనేట్ హాలుల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన బోధనేతర సిబ్బందికి శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. నిపుణులు అందించిన సూచనలు, సలహాలను పాటిస్తూ ఉద్యోగులు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. పరిపాలన సార్థ్యం, కార్యదక్షత పెంపొందిచుకున్నప్పుడే నిర్ధేశించిన లక్ష్యాలను సాధించగలమన్నారు. శిక్షణలో భాగంగా న్యాయపరమైన అంశాలు, కోర్టు కేసులు, వర్సిటీల చట్టాలపై ప్రొఫెసర్ సీతాకుమారి అవగాహన కల్పించారు. స్టాండింగ్ కౌన్సిల్, లీగల్ సర్వీసెస్, అఫిడవిట్ కౌంటర్ వంటి అంశాలను వివరించారు. అనంతరం సమాచార హక్కు చట్టంపై ఆర్యూ పరీక్షల విభాగాధికారి ఎస్ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించారు. రిజిస్ర్టార్లు విజయకుమార్ నాయుడు, శ్రీనివా్సలు ఉద్యోగులకు వికాసం, వ్యక్తిగత, వృత్తి జీవితాల మధ్య సమన్వయంపై సూచనలు చేశారు. కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికార్లు, రాయలసీమ, క్లస్టర్ వర్సిటీల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.