Share News

నైపుణ్యంతో భవిష్యత్తు

ABN , Publish Date - Jul 16 , 2026 | 12:16 AM

విద్యార్ధులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటనే భవిష్యత్తు ఉంటుందని మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ హెమిమా అన్నారు. బుధవారం పాఠశాలలో వరల్డ్‌ యూత్‌ స్కిల్స్‌ డే - 2026 నిర్వహించారు. విద్యార్ధులు ప్రదర్శించిన వృత్తి విద్య ప్రదర్శనలను వైస్‌ ప్రిన్సిపాల్‌ మునీంద్రతో కలిసి పరిశీలించారు. వృత్తి విద్య అధ్యాపకులు నరేంద్ర, హుస్సేన్‌ వలి పాల్గొన్నారు.

నైపుణ్యంతో భవిష్యత్తు
నైపుణ్యాలను ప్రదర్శిస్తున్న విద్యార్ధులు

అవుకు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): విద్యార్ధులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటనే భవిష్యత్తు ఉంటుందని మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ హెమిమా అన్నారు. బుధవారం పాఠశాలలో వరల్డ్‌ యూత్‌ స్కిల్స్‌ డే - 2026 నిర్వహించారు. విద్యార్ధులు ప్రదర్శించిన వృత్తి విద్య ప్రదర్శనలను వైస్‌ ప్రిన్సిపాల్‌ మునీంద్రతో కలిసి పరిశీలించారు. వృత్తి విద్య అధ్యాపకులు నరేంద్ర, హుస్సేన్‌ వలి పాల్గొన్నారు.

నైపుణ్యమే విజయానికి పునాది

రుద్రవరం: విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకుంటే విజయానికి పునాది అవుతందని ప్రిన్సిపల్‌ నాగేశ్వర్‌రవు తెలిపారు. బుధవారం ఆదర్శ పాఠశాలలో ప్రంపచ యువత నైపుణ్యదినోత్సవం నిర్వహించారు. ఆధునిక, వ్యవసాయం, విత్తనాల ఎంపిక, మొక్కల సంరక్షణ నీటి సంరక్షణ తదితర విషయాలపై అవగాహన కల్పించారు. కంప్యూటర్‌ పరిజ్ఞానం, డిజిటల్‌ లిటరసీ ఏఐ కోడింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ. డిజిటల్‌ టూల్స్‌పై విద్యార్థులకు ప్రాక్టికల్‌ శిక్షణ ఇచ్చారు. వ్యవసాయ ట్రైనర్లు జ్యోతిప్రియ, హరికృష్ణ పాల్గన్నారు.

కొలిమిగుండ్ల: చదువుతో పాటు, నైపుణ్యం సాధిస్తేనే విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని మోడల్‌స్కూల్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ గురప్ప అన్నారు. బుధవారం పాఠశాలలో నైపుణ్యం దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులకు టెక్నికల్‌, డిజిటల్‌, బిజినెస్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇస్తున్నామన్నారు. భాషా, రామ్మోహన్‌, గోవిందు, శివశంకర్‌, రాముడు ఉన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 12:16 AM