Share News

సంక్షేమ బోర్డుకు నిధులు కేటాయించాలి

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:24 AM

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు నిధులు కేటాయించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నక్కి లెనినబాబు డిమాండ్‌ చేశారు.

సంక్షేమ బోర్డుకు నిధులు కేటాయించాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఏఐటీయూసీ నాయకులు

ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లెనినబాబు

కర్నూలు న్యూసిటీ, జూన 1(ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు నిధులు కేటాయించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నక్కి లెనినబాబు డిమాండ్‌ చేశారు. సోమవారం ఏఐటీయూసీ ఆధ్వ ర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు లెనినబాబు మాట్లా డుతూ కార్మిక శాఖలో పెండింగ్‌లో ఉన్న 47 వేల క్లెయిమ్స్‌ను పరిష్క రించాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సంక్షేమ బోర్డుకి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. అప్పటికే ఉన్న సుమారు రూ.450 కోట్ల నిధులను ఇతర సంక్షేమ పథకాలకు దారి మళ్లించిందని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ బోర్డుకు నిఽధులు కేటాయిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. భవన నిర్మాణ కార్మికులకు మూడు సెంట్ల స్థలంతోపాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, యాభై ఏళ్లు నిండిన కార్మికులందరికీ రూ.10 వేల పింఛన ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నగర అధ్యక్షు డు జి.చంద్రశేఖర్‌, కార్మిక సంఘం కార్యదర్శి నల్లన్న, రామాంజనేయులు, రహిమాన, రేణుక, రవి, ధర్మ, బతుకమ్మ పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 12:25 AM