నిధులు విడుదల చేయాలి
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:25 AM
రాష్ట్ర ప్రభుత్వం మాల కార్పొరేషనకు నిధులు విడుదల చేయాలని మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు పిడతల వెంకటస్వామి కోరారు.
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పి. వెంకటస్వామి
కర్నూలు న్యూసిటీ, జూలై 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మాల కార్పొరేషనకు నిధులు విడుదల చేయాలని మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు పిడతల వెంకటస్వామి కోరారు. బుధవారం కర్నూలు బిర్లా కాంపౌండులోని జగదీష్ మాల్ ప్రాంతీయ కార్యాలయంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు జాముల సుంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అఽధికారం చేపట్టి రెండేళ్లువుతున్న మాల కార్పొరేషనకు నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉపాధి లేక నిరుపేద నిరుద్యోగులు ప్రభుత్వం వైపు చూస్తున్నారన్నారు. విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ బి.మహేష్, జిల్లా యువజన అధ్యక్షుడు మేకల అద్భుతకుమార్, చార్లెస్, శ్రీనివాసులు పాల్గొన్నారు.