శ్రీశైలంలో పౌర్ణమి పూజలు
ABN , Publish Date - May 01 , 2026 | 11:01 PM
శ్రీశైలంలో వైశాఖ పౌర్ణమి ప్రత్యేక పూజలను ఘనంగా ని ర్వహించారు.
భ్రమరాంబకు లక్ష కుంకుమార్చన - ఊయలసేవ
శ్రీశైలం, మే 1 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో వైశాఖ పౌర్ణమి ప్రత్యేక పూజలను ఘనంగా ని ర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున స్వామిఅమ్మవార్లకు సుప్రభాతసేవ, మహామంగళ హారతులు నిత్యకైంక ర్యాల అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. గ్రామదేవత అంకాల మ్మకు పంచామృతాభిషేకాలు నిర్వహించి అర్చనలు చేసినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. సాయంత్రం ఉత్సవ మూర్తులను ప్రధాన ద్వారంగుండా పల్లకిలో తీసుకువచ్చి గంగాధర మండపం వద్ద ప్రచార రథంపై ఆశీనులచేసి శివనామస్మరణ చేస్తూ గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని జరిపించారు. ధర్మప్రచార రథంలో జరిగిన గిరి ప్రద క్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి అలయ ప్రాకారంలో ఊయలలో కొలువుదీరిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూరుల వద్ద లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష కుంకుమార్చనలో భక్తులు పరోక్షసేవ ద్వారా పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం కల్పించింది. ఊయల సేవలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఊయలను వివిధ రకాలైన పుష్పాలతో అలంకరించి స్వామిఅమ్మవార్లకు లలితా సహస్ర నామాలతో పారాయణం, త్రిశతి, ఖడ్గమాల, అర్చనలు చేశారు. ఆలయ ప్రదక్షిణగా పల్లకి సేవను జరిపించారు. భక్తులకు ఉభయ దేవాలయాల్లో దర్శనాలు కల్పించి తీర్థప్రసాదాలు అందించారు.