హామీలను నెరవేరుస్తున్నాం
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:54 PM
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు
ఆళ్లగడ్డ, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. శనివారం ఆళ్లగడ్డ పురపాలక సంఘం పరిఽధిలోని బృందావనం కాలనీలో రూ.3 కోట్లతో చేయనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీని నిరిస్తున్నామన్నారు. అన్ని కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. అధికారం వచ్చి రెండేళ్లయినా తాను ప్రతికార రాజకీయాలకు పాల్పలేదని, వైసీపీ నాయకులపై ఒక్క కేసు పెట్టలేద తెలిపారు.
నియోజకవర్గాని అభివృద్ధి చేస్తున్నామని, రానున్న స్ధానిక సంస్థల ఎన్నికల్లో దైర్యంగా ఓట్లు అడిగి అన్ని స్ధానాలు కైవసం చేసుకుంటామని దీమా వ్యక్తంచేశారు. పట్టణంలోని ఎంవీ నగర్ కాలనీలో రూ.70లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. మాజీ కౌన్సిలర్ హుసెన్‌బాషా, విష్ణువర్ధన్‌రెడ్డి, పాల్గొన్నారు.