వైద్యులకు ఎఫ్‌ఆర్‌ఎస్ తప్పనిసరి
ABN , Publish Date - May 06 , 2026 | 11:54 PM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో పనిచేసే వైద్యులు తప్పనిసరిగా ఎఫ్‌ఆర్‌ఎస్ బయోమెట్రిక్ వేయాలని డీఎంహెచ్‌వో డా.వై.కామేశ్వర ప్రసాద్ ఆదేశించారు.
ఫడీఎంహెచ్‌వో డా.వై. కామేశ్వరప్రసాద్
కర్నూలు హాస్పిటల్, మే 6 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో పనిచేసే వైద్యులు తప్పనిసరిగా ఎఫ్‌ఆర్‌ఎస్ బయోమెట్రిక్ వేయాలని డీఎంహెచ్‌వో డా.వై.కామేశ్వర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆయన ప్రోగ్రాం ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి అన్ని పీహెచ్‌సీ, అర్బన్‌హెల్త్ సెంటర్లలో ప్రోగ్రాం ఆఫీసర్లకు కేటాయించిన ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ప్రతి బుధవారం ఇక నుంచి ప్రోగ్రాం ఆఫీసర్లతో సమీక్ష ఉంటుందని, ప్రభుత్వం నిర్ధేశించిన సమయంలో వైద్యులు తప్పనిసరిగా ఆసుపత్రుల్లో ఉండి వైద్యసేవలు అందించాలన్నారు. ఆసుపత్రులకు ఆలస్యంగా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుందని వైద్యులు వడదెబ్బపై అవగాహన కల్పించాలని, మందులు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉం చుకోవాలన్నారు. జిల్లా టీబీ ఆఫీసర్ డా.ఎల్.భాస్కర్ డిస్ర్టిక్ట్ మలేరియా ఆఫీసర్ టి.వెంకటేశ్, డీపీవో డా.శైలేష్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో (ఆదోని), డా.సత్యవతి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డా.భాస్కర్ రెడ్డి, ఆర్‌బీఎ్‌సకే జిల్లా కోఆర్డినేటర్ డా.మహేశ్వరరెడ్డి, న్యూక్లియర్ మెడికల్ ఆఫీసర్ డా.మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు.