Share News

వేసవి దుక్కులకు అన్నదాత సిద్ధం

ABN , Publish Date - May 11 , 2026 | 12:10 AM

మండలంలోని రైతులు వేసవి దుక్కులకు సిద్ధమయ్యారు. మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఉత్సాహంగా దు క్కులు దున్నుతున్నారు

వేసవి దుక్కులకు అన్నదాత సిద్ధం
కోసిగిలో పొలాన్ని దున్నుతున్న రైతు

పంట పొలాలకు ఎరువులు ఫ మొదలైన సేద్యం పనులు

కోసిగి, మే 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని రైతులు వేసవి దుక్కులకు సిద్ధమయ్యారు. మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఉత్సాహంగా దు క్కులు దున్నుతున్నారు. వీటితోపాటు పొలాలకు పశువుల పెంట, కంపోస్టు ఎరువులను వేస్తున్నారు. మరికొందరు రైతులు బోరుబావుల కింద పత్తి విత్తనాలు, ఉల్లి పంటలు సాగు చేస్తున్నారు. అలాగే చెరువులు, కుంటల్లోని సారవంతమైన మట్టిని పొలాల్లోకి తరలిస్తున్నారు. వేసవి దుక్కుల వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. వేసవిలో లోతుగా దుక్కులు దున్నడం వల్ల భూమి గుల్లగా మారి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. తేమలో జీవించే సూక్ష్మజీవులు, వానపాముల సంతతి వృద్ధి చెందుతాయని, ఇవి భూసార అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. ఖరీ్‌ఫకు ముందే భూములను లోతుగా దుక్కులు చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు.

తొలకరి కంటే ముందే దుక్కులు చేపట్టాలి. దీనివల్ల నేల మొత్తబడి వర్షం

నీరు భూమిలోకి ఇంకుతాయి. దుక్కులు లోతుగా, వాలుకు అడ్డంగా దున్నుకుంటే వర్షపునీరు భూమిలోకి ఇంకి తేమ నిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. దున్నేముందు భూమిలో పశువుల పేడ, కంపోస్టు ఎరువులు, చెరువు మట్టి వేయాలి. వర్షాకాలం రాకముందే భూమిని మూడుసార్లు దున్నాలని వాలుకు అడ్డంగా దున్నితే అధిక నీరు భూమిలోకి ఇంకింపజే యవచ్చన్నారు. రసాయనిక ఎరువులను, మందులను వినియోగించరాదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

వేసవి దుక్కులతో అధిక ప్రయోజనం

వేసవి దుక్కలతో రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. వేసవి దుక్కులు ముందు భూమిలో పశువులపేడ, కంపోస్టు ఎరువులు, చెరువు మట్టితో భూమి సారవంతమై తేమ నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగు తుంది. పొలాల్లో మంటలు వేయడం ద్వారా ఎర్రగొంగళి పురుగులను నివా రించవచ్చు. యాజమాన్య పద్ధతులు పాటిస్తే సాగు ఖర్చులు తగ్గించు కోవచ్చు. పంట దిగుబడి కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. - ఎం.వరప్రసాద్‌, మండల వ్యవసాయ అధికారి, కోసిగి

Updated Date - May 11 , 2026 | 12:10 AM