ఆర్థిక స్తోమత లేని నిందితులకు న్యాయ సేవలు
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:10 AM
ఆర్థిక స్తోమత లేని పేద నిందితులకు ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని న్యాయసేవాధికార సంస్థల సెక్రటరీ, సీనియర్ సివిల్ న్యాయాధికారి లీలా వెంకటశేషాద్రి అన్నారు.
న్యాయ సేవాధికార సంస్థల సెక్రటరీ లీలా వెంకటశేషాద్రి
నందికొట్కూరు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక స్తోమత లేని పేద నిందితులకు ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని న్యాయసేవాధికార సంస్థల సెక్రటరీ, సీనియర్ సివిల్ న్యాయాధికారి లీలా వెంకటశేషాద్రి అన్నారు. మంగళవారం ఆయన జూనియర్ సివిల్ న్యాయాధికారి దివ్యతో కలిసి నందికొట్కూరు సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. కారాగారంలో ఉన్న నిందితులు, ముద్దాయిలతో మాట్లాడుతూ లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల ద్వారా ఉచితంగా న్యాయసేవలను న్యాయ సలహాలు పొందవచ్చు అన్నారు. జైలు ఇన్‌చార్జీ అధికారి చంద్రశేఖర్, ప్యానల్ న్యాయవాది వెంకటేశ్వర్లు, వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి
ఈనెల 14వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ లీలా వెంకటశేషాద్రి, నందికొట్కూరు జూనియర్ సివిల్ న్యాయాధికారి దివ్య కోరారు. మంగళవారం కోర్టు ఆవరణలో నందికొట్కూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయాధికారి లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ సివిల్ క్రిమినల్ తగాదాలలో ఇరుపక్షాలతో మాట్లాడి రాజీ అయ్యే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.