దివ్యాంగులకు వరం.. ఉచిత బస్సు ప్రయాణం
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:18 AM
: టీడీపీ ప్రభుత్వం దివ్యాంగులకు ఉగాది కానుకగా దివ్యాంగశక్తి పథకం కింద ఉచితబస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు
చాగలమర్రి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వం దివ్యాంగులకు ఉగాది కానుకగా దివ్యాంగశక్తి పథకం కింద ఉచితబస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. దివ్యాంగులతో పాటు సహాయకులకు కూడా టికెట్‌లో 50 శాతం రాయితీ ఇస్తారు. నంద్యాల జిల్లాలో 25,780 మంది దివ్యాంగులు ఉన్నట్లు సమాచారం. ఈ పథకం పల్లెవెలుగు, అలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, ఆర్దీనరీ బస్సుల్లో వర్తిస్తుంది.
ఆళ్లగడ్డ: పట్టణంలోని డిపో వద్ద ఆర్టీసీ డీఎం సుబ్రహ్మణ్యం బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని నంద్యాల అర్డీవో, ప్రత్యేకాధికారి విశ్వనాథ్‌తో కలిసి ప్రారంభించారు. సీఎం చంద్రబాబుకు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్, మహిళా ఆధ్యక్షురాలు శివనాగమ్మ కృతజ్ఞతలు తెలిపారు. తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి, ఎంపీడీవో నూర్జహాన్, మున్సిపల్ కమిషనర్ కిషోర్, కౌన్సిలర్ హుసెన్‌బాషా, ఆర్‌టీసీ ఎస్టీఐ శ్రీనివాసులు, కంట్రోలర్ రమణ, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్పెక్టర్ శివారెడ్డి పాల్గొన్నారు.
ఎంతో ఆనందంగా ఉంది
దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇవ్వడంతో ఆనందంగా ఉంది. సహాయకుడికి కూడా 50 శాతం రాయితీ ఇవ్వడం అభినందనీయం. టీడీసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడంతో మేలు చేకూరింది. సీఎంకు కృతజ్ఞతలు. - ఖాదర్‌బాషా, దివ్యాంగుడు, చాగలమర్రి