Share News

‘పది’ విద్యార్థినులకు వీడ్కోలు

ABN , Publish Date - Feb 08 , 2026 | 12:22 AM

స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులకు శనివారం వీడ్కోలు పలికారు.

‘పది’ విద్యార్థినులకు వీడ్కోలు
ఉపాధ్యాయిలతో పదో తరగతి విద్యార్థినులు

చాగలమర్రి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులకు శనివారం వీడ్కోలు పలికారు. ఇన్నాళ్లు పాఠశాలలో చదువుకొని బయటకు వెళ్లి పోతుండటంతో విద్యార్థినులు దుఃఖాన్ని దిగమింగుతూ నేస్తమా మళ్లీ కలుద్దామంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. 85 మంది విద్యార్థినులు ఉన్నారని వందశాతం ఉత్తీర్ణత సాధించాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యాకమిటీ అధ్యక్షుడు ఉసేన్‌సా, హెచ్‌ఎం శివలక్ష్మి ఆకాక్షించారు.

Updated Date - Feb 08 , 2026 | 12:22 AM