Share News

నలుగురు బెట్టింగ్‌రాయుళ్ల ఆరెస్టు

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:19 AM

ఐపీఎల్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురిని పట్టణ పోలీసులు సోమవారం ఆరెస్టు చేసి వారి దగ్గరి నుంచి రూ 22లక్షల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు.

నలుగురు బెట్టింగ్‌రాయుళ్ల ఆరెస్టు
నగదు చూపుతున్న డీఎస్పీ భార్గవి, సీ ఐ శ్రీనివాసులు

నిందితుల నుంచి రూ. 22 లక్షల నగదు స్వాధీనం

ఎమ్మిగనూరు టౌన్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఐపీఎల్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురిని పట్టణ పోలీసులు సోమవారం ఆరెస్టు చేసి వారి దగ్గరి నుంచి రూ 22లక్షల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బెట్టింగ్‌ రాయుళ్లు డెక్కన్‌ 247 యాప్‌ను తయారు చేసి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు పట్టణ పోలీసులు సీఐ శ్రీనివాసులు బృందం ఎమ్మిగనూరుకు చెందిన మహ్మద్‌ ఖాజా వలి, సీయండీ షరీఫ్‌, సనాతన రంగాచారి, పెద్దతుంబలంకు చెందిన పవన్‌ కుమార్‌, సిరుగుప్పలను అరెస్టు చేశామని, శివమూర్తి, పీరా పరారీలో ఉన్నారని తెలిపారు. సీఐ శ్రీనివాసులు. ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి, హెచ్‌సీ మద్దిలేటి, పీసీలు, హుస్సేన్‌, గోపాల్‌, లోకేష్‌, రవిప్రకా్‌షరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 12:19 AM