Share News

ఈ గోదాములు ఎవరి కోసం?

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:06 AM

గత వైసీపీ హయాంలో రవ్వలకొండ, పసుపుల వద్ద రూ.కోట్లు ఖర్చుచేసి నిర్మించిన గోదాములు నిరుపయోగంగా మారాయి. అనువుగాలేని ప్రాంతంలో నిర్మించడం, ముళ్ల కంప మధ్య ఉండటంతో ఇవి నిరుపయోగంగా మారాయి.

ఈ గోదాములు ఎవరి కోసం?
రవ్వలకొండ వద్ద ఇలా..

గత వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా నిర్మాణం

ముళ్లకంప మధ్య, అనువుగా లేనిచోట్ల ఏర్పాటు

కోట్లలో ప్రజాధనం వృథా

ప్రైవేటు గోదాములను ఆశ్రయించి నష్టపోతున్న రైతులు

బనగానపల్లె, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ హయాంలో రూ.కోట్లు ఖర్చుచేసి నిర్మించిన గోదాములు ఉపయోగంలేకుండా పోయాయి. పట్టణానికి దూరంగా, ముళ్లకంప మధ్య నిర్మించడంతో ఇవి నిరుపయోగంగా మారాయి. పట్టణంలోని రవ్వలకొండపై రూ.83.19 లక్షలతో గత వైసీపీ హయాంలో గోదాం నిర్మాంచారు. ఇది తమ్మడపల్లె గ్రామ రైతుభరోసా కేంద్రానికి అనుబంధంగా భానుముక్కల సహకారం సంఘం సొసైటీ పరిధిలో కిలో మీటరు దూరంలో ఉంది. నిర్మాణం పూర్తిచేసి అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు. అయితే ఏమైందోగాని ఇది ఉపయోగంలోకి రావడం లేదు. దీంతో గోదాము చుట్టూ ముళ్ల కంప ఉడటంతో కొందరు బహిర్భూమికి వెళ్తున్నారు. అలాగే నందవరం సొసైటీకి సంబంధించిన గోదామును 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసుపుల గ్రామంలో నిర్మించారు. ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. టంగుటూరు సహకార సంఘం సొసైటీకి చెందిన గోదామును 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైపలో నిర్మిస్తున్నారు. ఇలా రూ.కోట్ల ప్రజాధన్ని కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసమే వృథా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రైవేటు గోదాములను ఆశ్రయిస్తున్న రైతులు

సహకారం సంఘాలచ ఆధ్వర్యంలో నిర్మించిన గోదాములు ఉన్నా రైతులకు ఉపయోగంలేకుండా పోయాయి. దీంతో రైతులు ప్రైవేటు గోదాములను ఆశ్రయిస్తున్నారు.వరి, శనగ, మొక్కజొన్న, కంది, తదితర పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వ గోదాములతే తక్కువ అద్దె వసూలు చేస్థారు. అదే ప్రవేటు గోదాముల్లో నిల్వ ఉంచాలంటే అఽధికంగా అద్దె చెల్లించాల్సి వస్తుంది. దీంతో రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, గోదాములను ఉపయోగంలోకి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Mar 28 , 2026 | 12:06 AM