గ్యాస్ కోసం..
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:08 AM
గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసి 15రోజలు దాటుతున్నా సిలిండర్‌లను గ్యాస్ ఏజెన్సీ ని ర్వాహకులు సరఫరా చేయడం లేదంటూ పత్తికొండలో ప్రజలు ఖాళీ సిలిండర్లతో రోడ్డెక్కి ఆందోళనకు దిగారు.
రోడ్డెక్కి నిరసన తెలిపిన వినియోగదారులు
పత్తికొండ, మార్చి24 (ఆంధ్రజ్యోతి): గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసి 15రోజలు దాటుతున్నా సిలిండర్‌లను గ్యాస్ ఏజెన్సీ ని ర్వాహకులు సరఫరా చేయడం లేదంటూ పత్తికొండలో ప్రజలు ఖాళీ సిలిండర్లతో రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. సుమారు గంట పాటు సాగిన ఆందోళనతో కర్నూలు ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపో యాయి. పత్తికొండ భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద మంగళవారం సంఘటన చోటుచేసు కుంది. పత్తికొండ పట్టణంలో, గ్రామీణ ప్రాం తాల్లో గ్యాస్ కోసం బుక్ చేసుకున్నవారికి 15రోజులైనా ఎందుకు సరఫరా చేయడం లేదని నిర్వాహకులను నిలదీశారు. వారం రోజలుగా గ్యాస్ లోడ్ రాకపోవడంతో సిలిండర్లను సరఫరా చేయలేకపోతున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు ఒక లోడు లో 300 సిలిండర్లు వస్తాయని, సీనియారిటీ ప్రకారం లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆందోళనకారులకు ప్రజాసంఘాల నాయకులు మద్దతు ఇచ్చారు.
3వేలకు పైగా బుకింగ్‌లో ఉన్నాయి
ఏజెన్సీ పరిధిలో మొత్తం 16వేల కనెక్షన్‌లు ఉన్నాయి. ఈరోజు వరకు 3వేల మంది లబ్ధిదారులు బుక్ చేసుకున్నారు. స్టాక్ వస్తే పంపిణీ చేస్తాం.
- లక్ష్మీనారాయణ, ఏజెన్సీ నిర్వాహకుడు