Share News

నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:21 AM

ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు పాటించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు

నిబంధనలు పాటించాలి
రుద్రవరం ఆర్‌వోతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

రుద్రవరం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు పాటించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రుద్రవరం, శిరివెళ్ల, ఆళ్గగడ్డ, దొర్నిపాడులోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. నామినేషన్‌ వేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని, అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు. అనంతరం ఆళ్లగడ్డలో సబ్‌ కలెక్టరు మనీషాతో కలిసి నామినేషన్లకేంద్రం తనిఖీ చేశారు.

ఆళ్లగడ్డ: పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం చివరి రోజున నామినేషన్‌ కేంద్రాలను కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌ షొరాన్‌, సబ్‌ కలెక్టర్‌ మనిషా పరిశీలించారు. ఆర్‌వో హరిగోపాల్‌కు సూచనాలు చేశారు. జిల్లాలో చివరి రోజు నామినేషన్‌ ప్రక్రియ ప్రశాతంగా ముగిసిందని ఎస్పీ తెలిపారు.

కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు

రుద్రవరం: ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సునీల్‌ షొరాన్‌ అన్నారు. శుక్రవారం రుద్రవరం నామినేషన్‌ కేంద్రాన్ని తనిఖీ చేశారు. నామినేసన్‌ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉన్నామని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. నిరంతరం సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షించాలని పోలీసు అధికారులు ఆదేశించారు. అనుమతి పొందిన వాహనాలు, వ్యక్తులకు మాత్రమే నామినేషన్‌ కేంద్రాలకు ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్‌, సీఐలు ప్రవీణ్‌కుమార్‌ఱెడ్డి, క్రిష్ణయ్య, ఎస్‌ఐ మహ్మద్‌రఫి, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 12:21 AM