పంటల సాగులో మెలకువలు పాటించాలి
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:21 AM
పంటల సాగులో రైతులు మెలకువలను పాటించాలని ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ పీవీ సత్యనారాయణ అన్నారు. శనివారం ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రాన్ని(కేవీకే) పరిశోధన సంచాలకులు రామచంద్రరావు, నంద్యాల అసోసియేట్ డైరెక ్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ జయలక్ష్మితో కలిసి ఆయన పరిశీలించారు. వీరికి బనవాసి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి ఘన స్వాగతం పలికారు
ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ పీవీ సత్యనారాయణ
బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం పరిశీలన
ఎమ్మిగనూరు రూరల్, జులై 18 (ఆంధ్రజ్యోతి): పంటల సాగులో రైతులు మెలకువలను పాటించాలని ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ పీవీ సత్యనారాయణ అన్నారు. శనివారం ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రాన్ని(కేవీకే) పరిశోధన సంచాలకులు రామచంద్రరావు, నంద్యాల అసోసియేట్ డైరెక ్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ జయలక్ష్మితో కలిసి ఆయన పరిశీలించారు. వీరికి బనవాసి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి ఘన స్వాగతం పలికారు. కేవీకేలో మొక్కలను నాటారు. ఆర్‌కెవైఎం పథకం కింద నిర్మించిన గోదాము, క్షేత్ర ప్రదర్శన యూనిట్లు, ఫార్మ్ కార్యకలాపాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. వాటి నిర్వాహణపై అధికారులకు పలు సూచనలు అందజేశారు. అనంతరం ఉపకులపతి డాక్టర్ పి.వి సత్యనారాయణ బృందం మండలంలోని బోడబండ గ్రామంలో రైతులు సాగుచేసిన పత్తి పంటలను పరిశీలించారు. పంటల మార్పిడితో మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటలను సాగుచేసుకోవాలన్నారు. నూనెగింజల పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా నిరంతరం సలహాలు, సూచనలు అందించాలన్నారు. కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ శారద, జయలక్ష్మిదేవి, డాక్టర్ సుజాతమ్మ, రైతులు, కేవీకే సిబ్బంది పాల్గొన్నారు.