Share News

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Oct 23 , 2026 | 11:29 PM

రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ సూచించారు.

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి
స్టాళ్లను పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌

జేసీ సూరజ్‌ ధనుంజయ్‌

నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోనని పీజీఆర్‌ఎస్‌ హాల్లో వ్యవసాయ శాఖ, ఆత్మ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కిసాన్‌ మేళా-2026, రైతు శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ ఆధారిత ప్రకృతి వ్యవసాయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్‌ను ప్రారంభించి, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, అటవీ ఆధారిత ఉత్పత్తులను పరిశీలించారు. పీఎండీఎస్‌, కిచెన్‌ గగార్డెన్‌ కిట్లు, ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ ధ్రువీకరణ పొందిన విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, విక్రయాల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. జేసీ మాట్లాడుతూ రసాయన రహిత సాగుకు ప్రాధాన్యమివ్వాలని, విత్తన శుద్ధిని తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ నంద్యాల అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ జయలక్ష్మి, ఉద్యాన శాఖాధికారి హరేంద్ర, శాస్త్రవేత్తలు రమణయ్య, అశోక్‌, లక్ష్మిప్రియ, నీలిమ, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2026 | 11:29 PM