Share News

తాగునీటి సమస్యపై దృష్టి పెట్టండి

ABN , Publish Date - May 14 , 2026 | 11:06 PM

తాగునీటి సమస్యపై దృష్టి పెట్టండి

తాగునీటి సమస్యపై దృష్టి పెట్టండి
కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, మే 14 (ఆంధ్రజ్యోతి): వేసవి కాలంలో తాగునీటి సమస్యపై మండల, గ్రామస్థాయి స్పెషల్‌, సంబంధిత శాఖల అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్‌ రాజకు మారి ఆదేశించారు. గురు వారం కలెక్టరేట్లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి తాగునీటి సరఫరా, పారిశుధ్యం, ప్రజాభిప్రాయ సర్వేలు, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రభుత్వ పథకాల అమలుపై సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లా డుతూ ప్రతి గ్రామంలో నీటి వనరులు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, బోర్‌ వెల్స్‌, పైప్‌లైన్ల పరిస్థితిని తనిఖీ చేయాలన్నారు. ప్రతి మూడో శనివారం నిర్వహించే ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర’లో అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. పీఎంఎవై కింద జిల్లాలో దాదాపు 36వేల ఇళ్లు పూర్తయినా అందులో సుమారు 4,500ఇళ్లకు మరుగు దొడ్లు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.

ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి..

ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కార్పొరేట్‌ సంస్థలు ముందుకు రావ డం అభినందనీయమని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాల బాలుర హాస్టల్‌-1, 2లకు నూతనంగా నిర్మించిన మరుగుదొడ్ల కాంప్లెక్స్‌ను ఆమె ప్రారంభించారు. ది రామ్‌ కో సిమెంట్‌్స్‌ లిమిటెడ్‌, కొలిమిగుండ్ల యూనిట్‌ రూ.14.53 లక్షల వ్యయంతో ఈమరుగుదొడ్ల సముదాయాన్ని నిర్మించి నట్లు తెలిపారు. రామ్‌కో సిమెంట్స్‌ కొలిమిగుండ్ల యూనిట్‌ హెడ్‌ మీనాక్షి సుందరం, ప్రెసిడెంట్‌ రామరాజ్‌, జనరల్‌ మేనేజర్‌ ప్రభాకర్‌, ఏజీఎం శోభన్‌కుమార్‌, కార్పొరేట్‌ సోష్‌ రెస్పాన్సిబిలిటీ మేనేజర్‌ శ్రీనాగరాజు, జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారిత అధికారిణి చింతామణి, కళాశాల వసతిగృహ సంక్షేమాధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2026 | 11:06 PM