Share News

గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:02 AM

గ్రామీణాభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు కేంద్ర బృందం సభ్యులు పేర్కొన్నారు.

గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
పనులను పరిశీలిస్తున్న కేంద్ర బృందం

మండలంలో కేంద్ర బృందం పర్యటన

కొలిమిగుండ్ల, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): గ్రామీణాభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు కేంద్ర బృందం సభ్యులు పేర్కొన్నారు. మండలంలోని వివిధ జరుగుతున్న అభివృద్ది పనులను బుధవారం కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి అజయ్‌ కుమార్‌ సాహూ, ఎకనామిక్‌ ఆఫీసర్‌ రూబల్‌ కుమార్‌తో పాటు పలువురు అధికారులు మండలంలో జరుగుతున్న ఉపాధి హమీ పథకం పనులు, స్వయం సహాయక సంఘాల పనితీరు, ఫించన్‌ పంపిణీ, తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు గృహ నిర్మాణ శాఖ నిర్మించిన గృహ లబ్ధిదారులతో కూడా కేంద్ర బృందం సభ్యులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని బృందం సభ్యులు వెల్లడించారు. మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెలుం గుహాలను వారు సందర్శించారు. ఏపీడీ సాంబశివరావు, కోర్సు డైరెక్టర్‌ యేసుదాసు, ఎంపీడీవో దస్తగిరిబాబు, ఏపీఎం చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 12:02 AM