తలసరి ఆదాయంపై దృష్టి సారించండి
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:13 PM
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో తలసరి ఆదాయాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు కలెక్టరేట్, మార్చి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో తలసరి ఆదాయాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో స్థిరమైన అభివృద్ది లక్ష్యాలు, జీడీడీపీ, జిల్లా కీలక పనితీరు సూచికలకు సంబంధించి వ్యవసాయ అనుబంధ శాఖలు, రవాణా, ఐసీడీఎస్, సంక్షేమం, టూరిజం, ఆర్టీసీ, పరిశ్రమలు, ఆర్‌డబ్లూఎస్, పం చాయతీరాజ్ రోడ్డు భవనాల శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగుభూమి విస్తీర్ణాన్ని పెంచి రైతుల ఆదాయాన్ని మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టళ్లను, పాఠశాలలను ఎంపీడీవోలు వారానికి ఒక్కసారి తనిఖీచేసి ఫొటోలను పంపాలన్నారు. సీపీవో భారతి, డీఎంహెచ్‌వో డా.భాస్కర్ రాజు, హౌసింగ్ పీడీ చిరంజీవి పాల్గొన్నారు.