రెవెన్యూ, వ్యవసాయ రంగాలపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Jun 16 , 2026 | 11:13 PM
: రాష్ట్రంలో రెవెన్యూ, వ్యవసాయ రంగాల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్
నంద్యాల నూనెపల్లి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో రెవెన్యూ, వ్యవసాయ రంగాల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. మంగళవారం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎస్‌సీఎల్‌ఏ, వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు, కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్వో రామునాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రెవెన్యూ అంశాల పురోగతి, భూ సంబంధిత సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
హై డెన్సిటీ ప్లాంటేషన్‌తో పచ్చదనానికి ప్రాధాన్యమివ్వాలి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో హై డెన్సిటీ ప్లాంటేషన్‌ను విస్తృతంగా చేపట్టి పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశిం చారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో హై డెన్సిటీ ప్లాంటేషన్ కార్యక్ర మాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల ప్రాంగణాల్లో హై డెన్సిటీ ప్లాంటేషన్ ద్వారా పర్యావరణహిత వాతావరణాన్ని సృష్టించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ప్రతినిధి శర్వాణన్ సుబ్రమణ్యం, డ్వామా పీడీ సూర్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి, డీఈఓ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.