Share News

తుంగభద్రకు తగ్గిన వరద

ABN , Publish Date - Jul 16 , 2026 | 12:17 AM

): ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద తగ్గిపోయింది. ఎగువన వర్షాలు కురవకపోవడంతో ఆశించిన స్థాయిలో వరదనీరు జలాశయానికి చేరలేదు.

తుంగభద్రకు  తగ్గిన వరద
ప్రస్తుతం తుంగభద్ర జలాశయం నీటి నిల్వ ఇది

హాలహర్వి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద తగ్గిపోయింది. ఎగువన వర్షాలు కురవకపోవడంతో ఆశించిన స్థాయిలో వరదనీరు జలాశయానికి చేరలేదు. ఆయకట్టు రైతులు నారుమళ్లు, ఎండుమిర్చి, పత్తి పంటలు విత్తుకుని జలాశయం నుంచి నీరు విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకు వరదతో ఊరించిన జలాశయం మూడు రోజుల నుంచి పూర్తిస్థాయిలో తగ్గిపోయింది. తుంగభద్ర పరివాహక ప్రాంతాలైన శివమొగ్గ, ఆగుంబె, మలెనాడు, తీర్థహళ్లి, శృంగేరి, హరిహర తదితర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జలాశయానికి ఇన్‌ఫ్లో తగ్గిపోయింది. బుధవారానికి కేవలం 4,724 క్యూసెక్కులకు పడిపోయింది. తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ కేవలం 25 టీఎంసీలు మాత్రమే ఉండడంతో రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మరో వారం రోజుల్లో వరద ప్రవాహం పెరిగితే తప్పతుంగభద్ర రైతులు గట్టెక్కే పరిస్థితి లేదని బోర్డు అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jul 16 , 2026 | 12:18 AM