Share News

జీడీపీకి వరద

ABN , Publish Date - Jun 14 , 2026 | 11:35 PM

గాజులదిన్నె ప్రాజెక్టుకు ఆదివారం తెల్లవారుజామున కురిన వర్షం కారణంగా ప్రాజెక్టుకు వరద వచ్చి చేరింది.

జీడీపీకి వరద
గాజులదిన్నె ప్రాజెక్టుకు చేరిన వరద

గోనెగండ్ల, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రాజెక్టుకు ఆదివారం తెల్లవారుజామున కురిన వర్షం కారణంగా ప్రాజెక్టుకు వరద వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 374.60 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన దేవనకొండ, మద్దికేర, తుగ్గలి, పత్తికొండ, తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురియడంతో ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరింది. అలాగే ఆస్పరి, ఆదోని ప్రాంతాలలో కూడా వర్షం కురియడంతో గంజహళ్లి దగ్గర ఉన్న పెద్ద వంక, మల్లెల వంక ద్వారా కూడా ప్రాజెక్టుకు వదర నీరు చేరింది. ఆదివారం ఉదయం ప్రాజెక్టులో 373.75 మీటర్ల నీరు ఉండగా ప్రస్తుతం 374.60 మీటర్లకు చేరింది. అంటే దాదాపు అర టీఎంసీ నీరు చేరినట్లు తెలుస్తోంది. దీంతో ప్రాజెక్టులో ప్రస్తుతం 2.5 టీఎంసీల నీరు పైగా నే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ప్రాజెక్టు కింద ఉన్న తాగునీటి పథకాలకు నీటి ఇబ్బంది ఉండకపోవచ్చు.

Updated Date - Jun 14 , 2026 | 11:35 PM