ఎగువ నుంచి భారీ వరద
ABN , Publish Date - Aug 04 , 2026 | 01:08 AM
): రాయలసీమ ప్రాంతానికి గుండెకాయలాంటి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ చెంతకు సోమవారం కృష్ణమ్మ పరుగులు పెడుతూ తాకింది. శ్రీశైలం జలాశయంలోకి ఎగువ ప్రాంతం జురాల ప్రాజెక్టు నుంచి 1.71లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరడంతో సాయంత్రానికి నీటిమట్టం 854.5 అడుగులకు చేరిందని నీటిపారుదలశాఖ అధికారులగణాంకాలు చెబుతున్నాయి
పోతిరెడ్డిపాడును తాకిన కృష్ణమ్మ
విడుదలకు అనుమతి కోసం ఎదురుచూపు
గేట్లను సిద్ధం చేస్తున్న కార్మికులు
జూపాడుబంగ్లా, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ ప్రాంతానికి గుండెకాయలాంటి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ చెంతకు సోమవారం కృష్ణమ్మ పరుగులు పెడుతూ తాకింది. శ్రీశైలం జలాశయంలోకి ఎగువ ప్రాంతం జురాల ప్రాజెక్టు నుంచి 1.71లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరడంతో సాయంత్రానికి నీటిమట్టం 854.5 అడుగులకు చేరిందని నీటిపారుదలశాఖ అధికారులగణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ముందస్తుగానే వరదలు రావడంతో జూలై6 వతేదీనే ప్రజాప్రతినిధులు పోతిరెడ్డిపాడు నుంచి దిగువ ఉన్న రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగునీటి అవసరాలకోసం విడుదల చేశారు. ఈ ఏడాది ఏపీలో ఎన్‌నీనో ప్రభావంతో తీవ్ర వర్షాభావంతో సాగుచేసిన మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, మినుము పంటలను దున్నేశారు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురిసిన వరదలకు శ్రీశైలం జలాశయంలోకి నీరు చేరుతుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. శ్రీశైలం జలాశయంపై ఆధారపడుతున్న కేసీ,ఎత్తిపోతల పథకాల రైతులు ఉన్నపంటలైనా కాపాడుకోవచ్చన్న ఆఽశతో ఎదురుచూస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ దిగువన ఉన్న తెలుగుగంగ,గాలేరునగరి, కేసీ ఎస్కేప్ కింద ఉన్న రైతులు నీటివిడుదలకోసం ఎదురుచూస్తున్నారు. గేట్లకు చిన్నచిన్న మరమ్మతులు చేస్తున్నారు. ఐరన్‌రో్‌పలకు గ్రీసును కార్మికులు వేస్తూ నీటివిడుదలకు సిద్దం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మూడురోజుల్లో అనుమతి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.