Share News

టీడీపీలో ఫ్లెక్సీ రగడ...

ABN , Publish Date - Nov 23 , 2026 | 11:36 PM

నగర పాలక సంస్థకు సంబంధించిన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గానికి చెందిన నలుగురు కార్పొరేటర్లు నిరసన తెలిపారు.

టీడీపీలో ఫ్లెక్సీ రగడ...
నగరపాలక సమావేశ భవనం ఎదుట నిరసన తెలుపుతున్న కోడుమూరు నియోజకవర్గ కార్పొరేటర్లు

కర్నూలు న్యూసిటీ, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థకు సంబంధించిన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గానికి చెందిన నలుగురు కార్పొరేటర్లు నిరసన తెలిపారు. సోమవారం ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవన దగ్గరలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆదివారం సాయంత్రం కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించిన నలుగురు కార్పొరేటర్ల ఫెక్సీని నగర పాలక భవనం దగ్గరలోని రైల్వే ట్రాక్‌కు కట్టించారు. అయితే అందులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌, మేయర్‌ బొల్లెద్దుల ప్రత్యూష ఫొటోలు లేవని కొందరు టీడీపీ నాయకులు ఆ ఫెక్సీని చించి వేసారు. అయితే మళ్లీ తిరిగి రాత్రి మరొక ప్లెక్సీని కట్టారు. దీంతో టీడీపీ నాయకుల మధ్య వివాదం మొదలైంది. కోడుమూరు నియోజకవర్గ కార్పొరేటర్లు తమ పరిధిలోనే ఫ్లెక్సీలు కట్టుకోవాలని కర్నూలు నియోజకవర్గ టీడీపీ నాయకులు తెలిపారు. అయితే నగరంలో ఎక్కడైనా కట్టుకుంటామని కోడుమూరు నియోజకవర్గ కార్పొరేటర్లు తేల్చేసి చెప్పారు. ఇదంతా పార్టీ నాయకుల వద్దకు వెళ్లింది. వారు నగర పాలక కమిషనర్‌తో మాట్లాడారు. చివరికి పోలీసుల సమక్షంలో ఫ్లెక్సీలు కట్టకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కోడుమూరు నియోజకవర్గ కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నిరసనకు దిగారు. దీని వల్ల ఆ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారానికి రాలేదు. ఆ తర్వాత వచ్చి సంతకాలు చేసి వెళ్లారు.

Updated Date - Nov 23 , 2026 | 11:36 PM