Share News

మత్స్యకారుల స్కిల్‌ టెస్ట్‌ వాయిదా

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:29 PM

బొందిమడుగుల చెరువులో చేపలు పెంపకం, చేపలు పట్టుకోవడమనే విషయా నికి సంబంధించి గురువారం జరగాల్సిన సిల్క్‌ టెస్ట్‌ ఇరువర్గాల వాగ్వాదం మధ్య వాయిదా పండింది. మండల పరిధిలోని బొంది మడుగుల చెరువు వద్ద మత్స్యశాఖ జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సంధ్యారాణి, స్కిల్‌ టెస్టు నిర్వహించేందుకు వచ్చారు.

మత్స్యకారుల స్కిల్‌ టెస్ట్‌ వాయిదా
మత్స్యశాఖ అధికారులకు వినతి పత్రం అందిస్తున్న బొందిమడుగుల గ్రామస్థులు

గ్రామస్థులందరినీ భాగస్వాములు చేయాలని వినతి

తమకే చేపలు పట్టే హక్కు ఉందన్న మత్స్యకారులు

తుగ్గలి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): బొందిమడుగుల చెరువులో చేపలు పెంపకం, చేపలు పట్టుకోవడమనే విషయా నికి సంబంధించి గురువారం జరగాల్సిన సిల్క్‌ టెస్ట్‌ ఇరువర్గాల వాగ్వాదం మధ్య వాయిదా పండింది. మండల పరిధిలోని బొంది మడుగుల చెరువు వద్ద మత్స్యశాఖ జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సంధ్యారాణి, స్కిల్‌ టెస్టు నిర్వహించేందుకు వచ్చారు. అదే సమయంలో విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీల సామాజిక వర్గాల ప్రజలు అక్కడకు చేరుకుని చెరు వు గ్రామంలోని అందరికీ సంబంధించిందని, కేవలం బెస్త కుల స్థు లకు మాత్రమే స్కిల్‌ టెస్టు పెడుతారని, గ్రామాల్లో ఉన్న అం దరికీ స్కిల్‌ టెస్టులో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు. గ్రామస్థులందరినీ చెరువులో చేపలు వదలడంలో భాగ స్వాము లు చేయాలని కోరారు. దీనికి మత్స్యశాఖ అధికారులు ఏమైనా సమస్యలు ఉంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. దీంతో బెస్త కులాలవారితో పాటు మిగతా కులాల వారికి కూడా చేపలు పట్టేందుకు అవకాశం ఇవ్వాలని, స్కిల్‌ టెస్టు కల్పిం చాలని కోరుతూ వారు వినతి పత్రం అందజేశారు. అయితే.. ఎన్నో ఏళ్ల నుంచి తాము నష్టాలు భరిస్తూ మత్స్య కారుల సొసైటీని ముందుకు నెట్టుకొస్తున్నామని, అలాంటిది ఇప్పుడు వచ్చి ఇతరులు కూడా భాగస్వాములు కావాలనడం తగదని బెస్త కులస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరగడంతో 52 మందికి నిర్వహిం చాల్సిన స్కిల్‌ టెస్టు వాయిదా పడింది. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు నాగరాజు, మత్స్యశాఖ సొసైటీ సభ్యులు మహేష్‌, నాగరాజు, రైతులు కేపీ రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 11:29 PM