Share News

కప్పట్రాళ్లలో తొలి డాక్టర్‌

ABN , Publish Date - Sep 03 , 2026 | 12:21 AM

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో తొలి డాక్టర్‌గా చింతమాను ప్రవీణ్‌ కుమార్‌ ఎంపికయ్యాడు. ఒకప్పుడు కక్షలు, కార్పణ్యాలు నిండిన దశ నుంచి విద్యను ఆయుధంగా చేసుకుని గ్రామ రూపురేఖలను మార్చుకుంటున్న కప్పట్రాళ్లలో ఇప్పుడు మొట్టమొదటి డాక్టర్‌గా చింతమాను ప్రవీణ్‌ కుమార్‌ ఎంబీబీఎస్‌లో సీటు సాధించారు

కప్పట్రాళ్లలో తొలి డాక్టర్‌
ప్రవీణ్‌కుమార్‌ను అభినందిస్తున్న రవికృష్ణ

దేవనకొండ/ కర్నూలు క్రైం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో తొలి డాక్టర్‌గా చింతమాను ప్రవీణ్‌ కుమార్‌ ఎంపికయ్యాడు. ఒకప్పుడు కక్షలు, కార్పణ్యాలు నిండిన దశ నుంచి విద్యను ఆయుధంగా చేసుకుని గ్రామ రూపురేఖలను మార్చుకుంటున్న కప్పట్రాళ్లలో ఇప్పుడు మొట్టమొదటి డాక్టర్‌గా చింతమాను ప్రవీణ్‌ కుమార్‌ ఎంబీబీఎస్‌లో సీటు సాధించారు. కప్పట్రాళ్ల గ్రామాన్ని దత్తత తీసుకున్న నాటి జిల్లా ఎస్పీ, ప్రస్తుత ఈగల్‌ చీఫ్‌ ఆకే రవికృష్ణ ఐపీఎస్‌ ప్రోత్సాహంతో గ్రామంలో చాలా మార్పులు జరిగాయి. వాటికి నిదర్శనంగా ప్రవీణ్‌ కుమార్‌ ఆలిండియా ర్యాంకు 79,668, స్టేట్‌ ర్యాంకు 2,255 సాదించి కడప ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించాడు. గ్రామంలో ఎంబీబీఎస్‌ సీటు సాధించిన తొలి విద్యార్థిగా ప్రవీణ్‌ కుమార్‌ నిలిచారు. ఆకే రవికృష్ణ మాట్లాడుతూ పది సంవత్సరాల కింద గ్రామాన్ని దత్తత తీసుకున్నాక ప్రవీణ్‌ కుమార్‌ డాక్టర్‌ సీటు సాధించడం తనకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిందన్నారు.

Updated Date - Sep 03 , 2026 | 12:21 AM