Share News

అంగన్‌వాడీ నిర్లక్ష్యంతో గౌడుగల్లుకు ముప్పు

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:24 AM

కోసిగి మండల పరిధిలోని గౌడుగల్లు గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌ కమలమ్మ చేసిన చిన్న తప్పు గ్రామాన్ని నిప్పుల కొలిమిగా మార్చింది. కొత్తగా నిర్మిస్తున్న అంగన్‌వాడీ కేంద్రం వద్ద పేరుకుపోయిన చెత్తను అంగన్‌వాడీ టీచర్‌ కమలమ్మ మిట్టమధ్యాహ్నం ఎండలో నిప్పు పెట్టడంతో ఆ నిప్పు రాజుకుంటూపోయి

అంగన్‌వాడీ నిర్లక్ష్యంతో గౌడుగల్లుకు ముప్పు
గౌడుగల్లు గ్రామాన్ని అలుముకున్న పొగ

చెత్తకు నిప్పు పెట్టడంతో పశుగ్రాసం, కట్టెలు దగ్ధం

ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయిన గ్రామస్థులు

కోసిగి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కోసిగి మండల పరిధిలోని గౌడుగల్లు గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌ కమలమ్మ చేసిన చిన్న తప్పు గ్రామాన్ని నిప్పుల కొలిమిగా మార్చింది. కొత్తగా నిర్మిస్తున్న అంగన్‌వాడీ కేంద్రం వద్ద పేరుకుపోయిన చెత్తను అంగన్‌వాడీ టీచర్‌ కమలమ్మ మిట్టమధ్యాహ్నం ఎండలో నిప్పు పెట్టడంతో ఆ నిప్పు రాజుకుంటూపోయి పక్కనే ఉన్న కట్టెలు, పశుగ్రాసాన్ని అంటుకుంది. దీంతో క్షణాల్లోనే మంటలు చెలరేగి గౌడుగల్లు గ్రామం మొత్తం పొగతో నిండిపోయింది. అంగన్‌వాడీ కేంద్రం పక్కనే రైతులు, గ్రామస్థులు పశువుల కోసం భద్రపరుచుకున్న పశుగ్రాసం, కట్టెల కుప్పలకు మంటలు వ్యాపించాయి. మహిళ రైతు లక్ష్మి వంట చెరుకు పూర్తిగా కాలిపోయి బూడిదైంది. మహిళా రైతులు లక్ష్మి, సరోజ, భీమక్క, మరో రైతు రామాంజనేయులు తమ పశువుల కోసం వేసుకున్న పశుగ్రాసం, పేడకల్లం మంటల్లో ఆహుతైంది. మంటలు భారీగా ఎగిసిపడటంతో గ్రామమంతా పొగ కమ్మేసింది. రూ.లక్షల్లో తమకు నష్టం వాటిల్లింది. కోసిగి ఎస్‌ఐ రమేష్‌ రెడ్డి, ఎస్‌ఐ రమేష్‌ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పించి అగ్నిప్రమాదాన్ని నివారించారు.

Updated Date - Apr 03 , 2026 | 12:24 AM