Share News

పెద్దాసుపత్రిలో అగ్నిమాపక శాఖ మాక్‌ డ్రిల్‌

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:13 AM

ఏపీ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖల ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.

పెద్దాసుపత్రిలో అగ్నిమాపక శాఖ మాక్‌ డ్రిల్‌
మాక్‌ డ్రిల్‌లో పాల్గొన్న ఆస్పత్రి అధికారులు, అగ్నిమాపక సిబ్బంది

కర్నూలు హాస్పిటల్‌, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ఏపీ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖల ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెం డెంట్‌ డా.కే. వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ మాక్‌డ్రిల్‌లో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జి.బాలరాజు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు, సెక్యూరిటీ, శానిటేషన, నర్సింగ్‌ సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ ఆసుపత్రి లోని ప్రతి విభాగంలో ఉన్న అగ్నిమాపక పరికరాలు, విద్యుత వైరింగ్‌లను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ ఆసుపత్రుల్లో షార్ట్‌ సర్క్యూట్లు లేదా గ్యాస్‌ లీకేజీల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌లు డా.ఎస్‌. లక్ష్మీబాయి, డా. నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎ్‌సఆర్‌ఎంవో డా.పద్మజ, ఆర్‌ఎంవో డా.వెంకటరమణ, అడ్మినిస్ర్టేటర్‌ సుబ్రహ్మణ్యం, హాస్పిటల్‌ అడ్మిని స్ర్టేషన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.శివబాల, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.కిరణ్‌ కుమార్‌, ఏఆర్‌ఎంవోలు డా.సునీల్‌ ప్రశాంత, డా.క్లింటన నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ సావిత్రీబాయి పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 12:13 AM