Share News

మార్కెట్‌ యార్డులో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:43 AM

వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్లాట్‌ ఫారంపై సోమవారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. దీంతో 10బోరాల పత్తి కాలిపోయింది.

మార్కెట్‌ యార్డులో అగ్నిప్రమాదం
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

తీగల రాపిడితో వ్యాపించిన మంటలు

రైతుకు చెందిన 10 బోరాల పత్తి దగ్ధం

ఆదోని అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్లాట్‌ ఫారంపై సోమవారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. దీంతో 10బోరాల పత్తి కాలిపోయింది. వివరాలివీ.. హానవాళ్లు గ్రామానికి చెందిన రాజు 16 బోరాల పత్తిని విక్రయానికి తీసుకొచ్చారు. కమీషన్‌ ఏజెంట్‌ దుకాణమైన మహా వీరభద్రేశ్వర ట్రేడర్స్‌ దుకాణం ముందు ప్లాట్‌ఫారంపై రైతు టెండర్‌కు ఉంచారు. ప్లాట్‌ఫారం షెడ్డు విద్యుత్‌ తీగలు రాపిడికి గురై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల చెలరేగాయి. చుట్టుపక్కల హమాలీలు రైతులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. మార్కెట్‌లోనే ఫైర్‌ ఇంజన్‌ ఉండడంతో సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకొని ఆర్పి వేశారు. 10 బోరాలు పత్తి కాలిపోవడంతో రూ. 2లక్షల పైగా నష్టం జరిగినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. మార్కెట్‌ యార్డ్‌ కార్యదర్శి గోవిందు మాట్లాడుతూ రైతుకు ఇన్పూరెన్స్‌ వచ్చే విధంగా చూస్తామని తెలిపారు. ఎమ్మెల్యే పార్థసారథి మార్కెట్‌ యార్డ్‌ చేరుకొని వివరాలను తెలుసుకొని రైతుకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పంట పొలాల పక్కనే మంటలు

కొలిమిగుండ్ల, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని సాయిబాబా గుడి వెనుకవైపు పంట పొలాల పక్కనే మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు పంట పొలాల పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో కంప చెట్లకు నిప్పు పెట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పక్కనే సుమారు 50 ఎకరాలలో కోత దశలో ఉన్న మొక్కజొన్న సాగు ఉండడంతో రైతుల్లో తీవ్ర ఆందోళనపడ్డారు. రైతులు చంద్రమోహన్‌, నారాయణ తదితరులు రామ్‌కో ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేయడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. అయినా పంట పొలాల పక్కన మంటలు చెలరేగుతూనే ఉండడంతో మొక్కజొన్న రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - Apr 07 , 2026 | 12:43 AM