Share News

అగ్నికి ఆహుతైన గడ్డివాములు

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:20 AM

మండలంలోని పాలకుర్తిలో పశువుల కోసం నిల్వ చేసిన ఐదు గడ్డివాములు, పశువులపాక అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామ సమీపంలో లక్కందిన్నె రోడ్డువైపున హరిజన పెద్ద పెద్దయ్యకు చెందిన వాముదొడ్డిలో గురువారం మధ్యాహ్నం మం టలు వ్యాపించాయి.

అగ్నికి ఆహుతైన గడ్డివాములు
దేవనకొండ, మండలంలోని పాలకుర్తిలో పశువుల పాక, గడ్డివాములు దగ్ధం

రూ.4లక్షల మేర నష్టం

దేవనకొండ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పాలకుర్తిలో పశువుల కోసం నిల్వ చేసిన ఐదు గడ్డివాములు, పశువులపాక అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామ సమీపంలో లక్కందిన్నె రోడ్డువైపున హరిజన పెద్ద పెద్దయ్యకు చెందిన వాముదొడ్డిలో గురువారం మధ్యాహ్నం మం టలు వ్యాపించాయి. అటుగా వెళ్తున్నవారు గమనించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో ఐదు గడ్డి వాములు, పక్కనే ఉన్న వెంకన్నకు చెందిన పశువుల పాక, అందులో వ్యవసాయ సామగ్రి దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్న చేరుకున్న ప్రయోజనం లేకుండా పోయింది. ఐదు గడ్డివాముల విలువ దాదాపు రూ.3లక్షలు, పశువుల పాక, అందులోని సామగ్రి విలువ రూ.1లక్ష వరకు బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో కాలిన పైపులు

మద్దికెర, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తపల్లికి చెందిన రమేష్‌, తిలక్‌ కుమార్‌లకు చెందిన వ్యవసాయ తోటలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో పైపులు, డ్రిప్పులు కాలిపోయాయి. రూ.3లక్షల మేర నష్టం వాటిల్లింది. వివరాలు.. గ్రామానికి చెందిన రమేష్‌, తిలక్‌కుమార్‌కు 12 ఎకరాల తోట గుండాలతండా రెవెన్యూ పరిధిలో ఉంది. డ్రిప్పు, పైపులు కొనుగోలు చేసి పొలంలో వేయాలని తెచ్చుకున్నారు. గురు వారం తెల్లవారుజామున విద్యుత్‌ హై ఓల్టేజీ రావడంతో విద్యుత్‌ పోల్‌ యర్త్‌ వైరు తెగిపోయి ఊడిపడటంతో పైపులు డ్రిప్‌తో పాటు ఇతర సామగ్రి కాలిపోయినట్లు బాధిత రైతులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.

Updated Date - Mar 27 , 2026 | 12:20 AM