విక్రయ కేంద్రాలకు సన్నబియ్యం
ABN , Publish Date - Aug 15 , 2026 | 11:29 PM
పేదలు సన్నబియ్యం విక్రయ కేంద్రాలను అందించామని, సద్వినియోగించుకోవాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, ఆగస్టు 15, ( ఆంధ్రజ్యోతి): పేదలు సన్నబియ్యం విక్రయ కేంద్రాలను అందించామని, సద్వినియోగించుకోవాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం బనగానపల్లె రైస్‌మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలాజీ మో డరన్ రైస్‌మిల్ ప్రాంగణంలో బియ్యం తగ్గింపు ధరల కేంద్రాన్ని మంత్రి ప్రా రంభించారు. పలువురికి సన్నబియ్యంను పంపిణీ చేశారు. మంత్రి బీసీ మాట్లాడుతూ పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై నిత్యావసర సరుకుల భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. మా ర్కెట్‌లో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో స్టీం బియ్యం కిలో రూ.52, రాబియ్యం కిలో రూ.50లకు విక్రయిస్తుందన్నారు. రైస్‌మిల్లర్లతో మాట్లాడి ప్రత్యేక కౌంటరును ఏర్పాటు చేయాలని తహసీల్దారు చంద్రశేఖర్‌ను ఆదేశించారు. ఈవో మురళీమోహన్, మార్కెట్‌యార్డు వైస్‌చైర్మన్ భూషన్న, నూర్‌షా దూదేకుల సంఘం రాష్ట్ర డైరక్టర్ కాశీంబాబు, బీజేపీ కార్యదర్శి శరత్‌చంద్రకుమార్, వరలక్ష్మి, మనోజ్, రైస్‌మిల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.