Share News

ఆర్థిక ‘భరోసా’ పింఛన్లు

ABN , Publish Date - Aug 01 , 2026 | 11:28 PM

పింఛన్లతో లబ్ధిదారులకు ఆర్థిక భరోసా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

ఆర్థిక ‘భరోసా’ పింఛన్లు
వృద్దురాలికి పింఛన్‌ అందిస్తున్న మంత్రి, కలెక్టర్‌

న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

పారదర్శకంగా పింఛన్ల పంపిణీ: కలెక్టర్‌

నంద్యాల రూరల్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): పింఛన్లతో లబ్ధిదారులకు ఆర్థిక భరోసా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. శనివారం పట్టణంలోని రైతునగరంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీచేశారు. ఆయన మాట్లాడు తూ అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్‌ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. కలెక్టర్‌ రాజకుమారి మా ట్లాడుతూ పింఛన్ల పంపిణీ పారదర్శకంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మంచానికే పరిమిత మైన వారికి, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఎలాంటి ఇబ్బంది పడుకుండా వారి ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని సచివాలయ సిబ్బందికి ఆదేశించామన్నారు. కార్యక్రమంలో నంద్యాల యార్కెట్‌యార్డు చైర్మన్‌ గుంటు పల్లి హరిబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ శేషన్న, డీఆర్డీఎ పీడీ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2026 | 11:28 PM