Share News

సర్పంచ్‌ల తుది జాబితా విడుదల

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:05 PM

పల్లెపోరు మూడో విడత తుది జాబితాను జిల్లా అధికార యంత్రాంగం శనివారం విడుదల చేసింది. జిల్లాలోని 9 మండలాల పరిధిలోని 158 సర్పంచ్‌లకు- 1,111, 1,606 వార్డులకు 3,871 నామినేషన్లు స్వీకరిం చారు.

సర్పంచ్‌ల తుది జాబితా విడుదల

158 గ్రామ పంచాయతీల్లో 25 స్థానాలు ఏకగ్రీవం

మిగిలిన 133 సర్పంచ్‌లకు 406 మంది పోటీ

392 వార్డులు ఏకగ్రీవం

నంద్యాల, నవంబరు28(ఆంధ్రజ్యోతి): పల్లెపోరు మూడో విడత తుది జాబితాను జిల్లా అధికార యంత్రాంగం శనివారం విడుదల చేసింది. జిల్లాలోని 9 మండలాల పరిధిలోని 158 సర్పంచ్‌లకు- 1,111, 1,606 వార్డులకు 3,871 నామినేషన్లు స్వీకరిం చారు. పరిశీలన, ఉపసంహరణతో పాటు తాజాగా తుది జాబితా విడుదలైంది. 158 గ్రామ పంచాయతీల్లో 25 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 133 సర్పంచ్‌ స్థానాలకు 306 మంది మధ్య పోటీ నెలకొంది. ఆయా అభ్యర్థులు నేటి నుంచి ప్రచారం మొదలెట్టారు. డిసెంబరు 2న పోలింగ్‌, ఓట్ల లెక్కంపు. పోలింగ్‌ ఫలితాలతో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 1,606 వార్డులకు వచ్చిన 3,871 నామి నేషన్ల పరంగా ఆదివారం తుది జాబితా విడుదల కానుంది.

392 వార్డులు ఏకగ్రీవం

మూడో విడతలోని 1,606 వార్డులకు 3871 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 392వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఆత్మకూరు డివిజన్‌లోని జూపాడుబంగ్లా-10, కొత్తపల్లి-13, మిడ్తూరు-65, నందికొట్కూరు-26, పగిడ్యాల-25, పాములపాడు-20, డోన్‌ డివిజన్‌లో బేతంచెర్ల- 36, డోన్‌- 112, ప్యాపిలి-85 చొప్పున ఏకగ్రీవమైనట్లు తెలిసింది. మిగిలిన 1,213వార్డులకు 2,717 మంది మధ్య పోటీ నెలకొంది. ఆత్మకూరు డివిజన్‌లో- 654 వార్డులకు- 1,425, డోన్‌ డివిజన్‌లో- 559 వార్డులకు- 1,292 మంది మధ్య బరిలో ఉన్నారు.

మూడో విడత సర్పంచ్‌ స్థానాల పరిస్థితి ఇలా..

మండలం సర్పంచ్‌ ఏకగ్రీవం పోలింగ్‌ అభ్యర్థులు

జూపాడుబంగ్లా 12 01 11 29

కొత్తపల్లి 12 01 11 40

మిడ్తూరు 19 03 16 46

నందికొట్కూరు 12 01 11 31

పగిడ్యాల 08 02 06 14

పాములపాడు 14 02 12 36

బేతంచెర్ల 19 02 17 67

డోన్‌ 31 05 26 69

ప్యాపిలి 31 08 23 74

మొత్తం 158 25 133 406

Updated Date - Nov 28 , 2026 | 11:05 PM