Share News

30న ఓటర్ల తుది జాబితా ప్రచురణ

ABN , Publish Date - Nov 17 , 2026 | 10:55 PM

జిల్లాలో ఈనెల 30న ఓటర్ల తుది జాబితాను ప్రచురించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) రామునాయక్‌ పేర్కొన్నారు.

30న ఓటర్ల తుది జాబితా ప్రచురణ
రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న డీఆర్వో

డీఆర్వో రామునాయక్‌

నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈనెల 30న ఓటర్ల తుది జాబితాను ప్రచురించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) రామునాయక్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన తమ చాంబర్‌లో ఓటర్ల జాబితా రూపకల్పనపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ పెండింగ్‌ లేకుండా సకాలంలో పూర్తి చేశామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏ ఓటర్‌ అయినా సర్‌ సమయంలో వారి ఓటు హక్కు కోల్పోయినట్లయితే తిరిగి ఓటు హక్కును ఫామ్‌-6 ద్వారా పొందే అవకాశం ఉందన్న విషయాన్ని ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. కాంగ్రెస్‌, వైఎస్సార్సీపీ, బీజేపీ, జనసేన, ఆమ్‌ ఆద్మీ పార్టీల ప్రతినిధులు రియాజ్‌బాషా, సాయిరామ్‌ రెడ్డి, చంద్రశేఖర్‌, రవికుమార్‌, మదిన్షావలి పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 10:55 PM