Share News

తిమ్మనాయిని పేట చెరువును నింపండి

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:04 AM

మండలం తిమ్మనాయినిపేట చెరువును నీటితో నింపాలని మండల రైతులు కోరుతున్నారు. మండలానికి 1 టీఎంసీ నీఇని నింపుకునే అవకాశం ఉంది.

తిమ్మనాయిని పేట చెరువును నింపండి
కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయినిపేట చెరువు

పొలాలను కాపాడాలని రైతులు..

రాయితీలు ఇవ్వాలని సీఎంకు పరిశ్రమల యజమానుల వినతులు..

కొలిమిగుండ్ల, జూలై 8 (ఆంధ్రజ్యోతి): మండలం తిమ్మనాయినిపేట చెరువును నీటితో నింపాలని మండల రైతులు కోరుతున్నారు. మండలానికి 1 టీఎంసీ నీఇని నింపుకునే అవకాశం ఉంది. గత టీడీపీ హయాంలో నీటితో నింపేందుకు సీఎం చంద్రబాబు అవుకు రిజర్వాయర్‌ నుంచి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పద్ధతితో నీటిని నింపేందుకు జీవో విడుదల చేశారు. అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని అటకెక్కించింది. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సీఎం చంద్రబాబు స్పందించి, అవుకు రిజర్వాయర్‌ లీకేజీని అరికట్టాలని కోరుతున్నారు.

సీఏం పర్యటనపై ప్రజల ఆశలు

మండలంలో నాపరాళ్ల పరిశ్రమలు విస్తారంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం సంక్షోభంలో ఉండటంతో యజమానులు నష్టపోయారు. పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని పరిశ్రమల యజమానులు కోరుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని సిమెంట్‌ పరిశ్రమల హబ్‌గా మార్చిన చంద్రబాబు, మరిన్ని కొత్త హామీలు ఇస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలకు నీటి అవసరాలతో పాటు, ఇతర సౌకర్యాలు కల్పించాలి కోరుతున్నారు.

Updated Date - Jul 09 , 2026 | 12:04 AM