Share News

ముమ్మురంగా సూగూరు గండి పూడ్చే పనులు

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:22 AM

మండలంలో కురిసిన భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగిపొర్లి ప్రవహించడంతో వగరూరు దగ్గర నిర్మించిన గురురాఘవేంద్ర సూగూరు రిజర్వాయర్‌ చెరువుకు పడిన గండిని పూడ్చే పనులు ముమ్మురంగా సాగుతున్నాయి.

ముమ్మురంగా సూగూరు గండి పూడ్చే పనులు
రిజర్వాయర్‌ కట్టకు పడిన గండిని పూడుస్తున్నఎక్స్‌కవేటర్‌

మంత్రాలయం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): మండలంలో కురిసిన భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగిపొర్లి ప్రవహించడంతో వగరూరు దగ్గర నిర్మించిన గురురాఘవేంద్ర సూగూరు రిజర్వాయర్‌ చెరువుకు పడిన గండిని పూడ్చే పనులు ముమ్మురంగా సాగుతున్నాయి. బుధవారం ఎల్లెల్సీ ఇరిగేషన్‌ ఎస్‌సీ బాలచంద్రారెడ్డి ఆదేశాలతో ఈఈ శైలేశ్వర్‌, డీఈ విద్యసాగర్‌, ఏఈ పరమేష్‌ పనులను దగ్గరుండి పూడ్చే పనులు చేస్తున్నారు. గండిపడిన చోట శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు అంచెలంచెలుగా మట్టిని నింపుతూ కట్ట పటిష్టంగా ఉండేందుకు అడుగులు వేస్తున్నారు. మూడు ఎక్స్‌కవేటర్లు, 20 ట్రాక్టర్లతో మట్టిని తరలించి గండి పూడ్చేశారు. రిజర్వాయర్‌ కట్ట ఇరువైపులా మొలిచిన ముళ్లకంపలు, పిచ్చి మొక్కలు తొలగించే పనులు చేట్టారు. వరుస క్రమంగా నల్లమట్టి, ఎర్రమట్టితో కట్ట భద్రంగా ఉండేలా గండిని పూడ్చి వేశారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కారట్యదర్శి తిక్కారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి ఆదేశాలతో సీవీ విశ్వనాథరెడ్డి, కాంత్‌రెడ్డి, షాకీర్‌ దొర, మాజీ సర్పంచు లింగారెడ్డి, టీడీపీ నాయకులు అబ్దుల్లా, పవన్‌కుమార్‌రెడ్డి, గోపాల్‌ ఆధ్వర్యంలో రైతులు సహకారంతో రిజర్వాయర్‌ కట్టకు పడిన గండిని పూడ్చి పెద్ద ప్రమాదం తప్పించారు.

Updated Date - Jun 18 , 2026 | 12:22 AM