Share News

వైద్యుల మధ్య గొడవ

ABN , Publish Date - May 15 , 2026 | 11:42 PM

ఇద్దరు వైద్యులు ప్రభుత్వాస్పత్రిలోనే గొడవ పడ్డారు. ఈఘటన పత్తికొండలో గురువారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వైద్యుల మధ్య గొడవ

స్వీపర్‌ను మందలించిన ఓ వైద్యురాలు

పోలీసుస్టేషన్‌కు చేరిన పంచాయితీ

పత్తికొండ, మే 15(ఆంధ్రజ్యోతి): ఇద్దరు వైద్యులు ప్రభుత్వాస్పత్రిలోనే గొడవ పడ్డారు. ఈఘటన పత్తికొండలో గురువారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో స్వీపర్‌గా గతేడాది కాంట్రాక్ట్‌ పద్ధతిన ఓమహిళ చేరింది. ఆమె విధుల్లో అలసత్వం వహిస్తూ డ్యూటీ వేళలు పాటించడం లేదన్న ఫిర్యాదులు వైద్యాధికారిణికి రావడంతో పలుసార్లు మందలించారు. గురువారం కూడా విధుల సమయంలో స్వీపర్‌ బయటకెళ్లింది. వైద్యాధికారిణి పిలిచి పద్ధతి మార్చుకో వాలని, లేకపోతే ఉద్యోగం ఇబ్బందుల్లో పడుతుందని మందలించారు. ఈ విషయం తెలుసుకున్న అక్కడే పనిచేసే మరో వైద్యురాలు ఆవైద్యాధికారిణితో వివాదానికి దిగారు. ఓదశలో ఇద్దరి మధ్య గొడవ పెద్దది కావడంతో చివరకు ధైర్యం చేసి సిబ్బంది అడ్డుకున్నారు.

వైద్యురాలి ఇంట్లో పనిచేస్తూ..

ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న స్వీపర్‌ మరో వైద్యురాలి ఇంట్లో పనిమనిషిగా జీతంపై పనిచేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ విధులు ముగించుకొని అక్కడ పని చేసేందుకు వెళ్లినట్లు తెలిసింది. వైద్యాధికారిణి మందలించడంతో ఆవైద్యురాలు ఆగ్రహంతో వైద్యాధికారిణిపై బాహాబాహీకి ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ పంచాయితీ పోలీసుస్టేషన్‌కు చేరింది. ఈవిషయంపై వైద్యాధికారిణిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా వివాదం చోటుచేసుకున్న మాట వాస్తవమేనన్నారు

Updated Date - May 15 , 2026 | 11:42 PM