Share News

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:34 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటా లకు సిద్ధం కావాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే.జగ న్నాథం పిలుపునిచ్చారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం
అంబేడ్కర్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న నాయకులు

రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం

కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటా లకు సిద్ధం కావాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే.జగ న్నాథం పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్స వాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాజ్‌విహార్‌ కూడలిలో సీపీఐ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జగన్నాథం మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, రాజ కీయ అసమానతలను అంతం చేయాలన్నారు. ఆదాని, అంబానీ, నీరవ్‌ మోదీ, లలితమోదీ లాంటి వారి ఆస్తులను జాతీయం చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృ ష్ణారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి నక్కి లెనినబాబు, సహాయ కార్యదర్శి సి.మహేష్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 12:34 AM