Share News

క్షేత్రస్థాయి పరిశీలన అవసరం

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:09 AM

నగర ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటికి సత్వర పరిష్కారం చూపేం దుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు సూచించారు.

క్షేత్రస్థాయి పరిశీలన అవసరం
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): నగర ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటికి సత్వర పరిష్కారం చూపేం దుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు సూచించారు. స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 18 అర్జీలను స్వీకరించారు. అర్జీలను సంబం ధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్‌ సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఈ జే.రమణమూర్తి, డీసీపీ శభ్నం శాసి్త్ర, ఏసీపీ నాగరాజు, మేనేజర్‌ జునైద్‌, ఆర్‌ఓలు క్రిష్టఫర్‌, వాజిద్‌ పాల్గొన్నారు.

ఫ కర్నూలు నగరంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి సి.గురుశేఖర్‌ కోరారు. సోమవారం పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసులను కలిసి వినతిపత్రం అంద జేశారు. గురుశేఖర్‌ మాట్లాడుతూ రజక సామాజిక వర్గంలో పుట్టి బానిసత్వానికి, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాడిన ఐలమ్మ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో నాయకులు సి.శేషాద్రి, సీహెచ. శ్రీనివాసులు, సి.రాముడు, శేఖర్‌బాబు, రామాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 12:09 AM