Share News

పల్లెకు పండుగ

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:26 AM

: గ్రామాల్లో మైరుగైన వసతులు, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేయడమే పల్లెపండుగ ఉద్దేశ్యమని ఎమ్మెల్యే కోట్ల తెలిపారు.

పల్లెకు పండుగ
మండ్లవానిపల్లెలో భూమిపూజ చేస్తున్న డోన్‌ ఎమ్మెల్యే కోట్ల

మండలాలకు పల్లె పండుగ 3.0 నిధులు కేటాయించిన ప్రభుత్వం

బేతంచెర్ల, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో మైరుగైన వసతులు, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేయడమే పల్లెపండుగ ఉద్దేశ్యమని ఎమ్మెల్యే కోట్ల తెలిపారు. మంగళవారం మండలంలోని మండ్లవానిపల్లె, ఎంబాయి, బైనపల్లె, సంకలాపురం, సీతారామాపురం గ్రామాల్లో పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.55లక్షలతో చేయనున్న అభివృద్ధి పనులకు డోన్‌ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్‌ రెడ్డి సోమవారం భూమి పూజచేశారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పీఆర్‌ డీఈ గంగాధర్‌, ఏఈ మహేష్‌, డీఈ మల్లికార్జున, ఎంపీడీవో ఫజల్‌ రెహమాన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ రాజశేఖర్‌ రెడ్డి, ఏపీవో విజయ రాణి, టీడీపీ కన్వీనర్‌ ఎల్ల నాగయ్య, తిరుమలేష్‌ చౌదరి, ఉన్నం సుధాకర్‌, భీమేశ్వర్‌ రెడ్డి, జాకీరుల్లా బేగ్‌, మల్లారెడ్డి పాల్గొన్నారు.

అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

సంజామల: గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీడీవో సాలమోన్‌ అన్నారు. మంగళవారం ఆల్వకొండ, రెడ్డిపల్లె గ్రామాల్లో రూ.42 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనును ప్రారంభించారు. అనతరం ఆల్వకొండలో గోకులం షెడ్డును ప్రారంభించారు. చిన్నబాబు, డిప్యూటీ ఎంపీడీవో సురే్‌షబాబు, పశు వైద్యాధికారి కృష్ణ కుమార్‌, ఏపీవో ప్రకాష్‌, పీఆర్‌ ఏఈ రషీద్‌ పాల్గొన్నారు.

‘పల్లెపండుగ’ నిధులతో సీసీ రోడ్లు

రుద్రవరం: డి.కొట్టాల, శ్రీరంగాపురం గ్రామాల్లో పల్లెపండుగ నిధులతో మంగళవారం సీసీ రోడ్ల నిర్మాణానికి టీడీపీ కన్వీనర్‌ ఎల్‌వీ రంగనాయకులు భూమిపూజ చేశారు. డి.కొట్టాలలో రూ.30లక్షలు, టి.కొట్టాలలో రూ.5లక్షలు, శ్రీరంగాపురంలో రూ.10లక్షలతో సీసీరోడ్లు నిర్మిస్తున్నామన్నారు. ప్రత్యేకాధికారి మనోరంజన్‌ ప్రతాప్‌, ఏఈ కమాల్‌సాహెబ్‌, టీడీపీ నాయకులు చంద్రశేఖర్‌, మాజీ సర్పంచ్‌ నారాయణరెడ్డి, నాగిరెడ్డి, నరసింహారెడ్డి, కార్యదర్శులు పాములేటి, హితేష్‌ పాల్గొన్నారు.

‘పల్లెపండుగ’కు రూ.3.45కోట్లు మంజూరు

మండలానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సహకారంతో పల్లెపండుగ 3.0 కింద రూ.3.45 కోట్లు మంజూరు చేసినట్లు పీఆర్‌ ఏఈ కమాల్‌సాహెబ్‌ తెలిపారు. మంగళవారం మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సీసీరోడ్లు నిర్మిస్తామన్నారు.

సీసీ రోడ్ల పనులు ప్రారంభం

కోవెలకుంట్ల: పట్టణంలోని స్కందా కాలనీలో పల్లె పండుగ 3.0 కింద రూ.17లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీడీవో నాగశివ ప్రసాద్‌, డిప్యూటీ ఎంపీడీవో ప్రకాష్‌ నాయుడు మంగళవారం ప్రారంభించారు. మంత్రి బీసీ ఇక్కడి సమస్యలను స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారని, సీసీ రోడ్డును మంజూరు చేయించారని తెలిపారు. పీఆర్‌ఏఈ గౌస్‌, కాంట్రాక్టర్‌ చిట్టి, ఈసి హరి పాల్గొన్నారు.

కొలిమిగుండ్ల: పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీడీవో దస్తగిరిబాబు పేర్కొన్నారు. మంగళవారం పెద్దవెంతుర్ల గ్రామంలో ‘పల్లె పండుగ-3’ నిధులతో ప్రారంభించారు. నూతన సీసీ రోడ్ల నిర్మాణాలు, గోకులం షెడ్డు నిర్మాణానికి ఎంపీడీవో భూమిపూజ చేశారు. పీఆర్‌ ఏఈ అన్వర్‌బాషా, టీడీపీ నాయకులు చెన్నారెడ్డి, వెంకటేశ్వరరావు, ఆదినారాయణ, గోవర్ధన్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:26 AM