Share News

ప్రకృతి వ్యవసాయంతో భూమి సారవంతం

ABN , Publish Date - May 21 , 2026 | 12:17 AM

ప్రకృతి వ్యవసాయం సాగు పుడమికి బలమని, పీఎండీఎస్‌ వ్యవసాయం ద్వారా భూమి సారవంతం అవుతుం దని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి రైతులకు సూచించారు.

ప్రకృతి వ్యవసాయంతో భూమి సారవంతం
పంటను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సిరి, ఎమ్మెల్యే గౌరు చరిత

చిన్నటేకూరులో పర్యటించిన కలెక్టర్‌, ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, మే 20(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయం సాగు పుడమికి బలమని, పీఎండీఎస్‌ వ్యవసాయం ద్వారా భూమి సారవంతం అవుతుం దని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి రైతులకు సూచించారు. బుధవారం కల్లూరు మండలం చిన్నటేకూరులో పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితతో కలిసి కలెక్టర్‌ పర్యటించి పీఎండీఎస్‌ విధానం ద్వారా సాగు చేస్తున్న పంటలను పరిశీలిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షాధార వ్యవసాయానికి పీఎండీఎస్‌ విధా నం ఒక వరమని, రైతులకు అధిక లాభాలు సాధ్యమని అన్నారు. అనం తరం రైతులు ఆంజనేయులు, రామదాసు, రామేశ్వరమ్మ పొలాలను పరిశీ లించారు. ఈపద్ధతిలో నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి రసాయనిక ఎరువుల అవసరం లేకుండానే భూమి సారవంతంగా మారి అధిక దిగు బడులు సాధించవచ్చన్నారు. జిల్లాలో లక్ష ఎకరాల్లో పీఎండీఎస్‌ విధానం ద్వారా వ్యవసాయం సాగే లక్ష్యమని, మల్లెపంట విస్తీర్ణం పెంపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఉద్యానశాఖ అధికారులను ఆదేశించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితతో కలిసి కలెక్టర్‌ రైతు మోహన పొలంలో పీఎండీఎస్‌ విత్తనాలను చల్లి రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఒకే రకమైన పంట కాకుండా మిశ్రమ రకాల పంటలైన పండ్లు, పూలతోటలను సాగు చేయాలన్నారు. ఏపీఎంఐపీ ద్వారా స్ర్పింకర్లు 50 శాతం, డ్రిప్‌ 90శాతం సబ్సీడీ ఉందని రైతులు ఈఅవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. డీహెచఓ రాధాకృష్ణారెడ్డి, డీపీఎం మాధురి, వ్యవసాయ అధికారి విష్ణువర్ధన రెడ్డి, తహసీల్దారు కె.ఆంజ నేయులు రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2026 | 12:17 AM