Share News

అందుబాటులో ఎరువులు, విత్తనాలు

ABN , Publish Date - May 21 , 2026 | 12:16 AM

రాబోయే ఖరీఫ్‌ సీజనలో పంటల సాగు కోసం రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి ఇనపుట్‌ డీలర్లను హెచ్చరించారు.

అందుబాటులో ఎరువులు, విత్తనాలు
మాట్లాడుతున్న జేడీ వరలక్ష్మి

అధిక ధర వసూలు చేస్తే కఠిన చర్యలు

ఇనపుట్‌ డీలర్ల సమావేశంలో జేడీ వరలక్ష్మి

కర్నూలు అగ్రికల్చర్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): రాబోయే ఖరీఫ్‌ సీజనలో పంటల సాగు కోసం రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి ఇనపుట్‌ డీలర్లను హెచ్చరించారు. బుధవారం కర్నూలు నగరంలోని ఉద్యానభవనలో జిల్లా డీలర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టెక్నికల్‌ ఏవో శ్రీవర్దన రెడ్డి, కల్లూరు ఏవో విష్ణువర్దన రెడ్డి, కర్నూలు ఏవ రూపస్‌ రోనాల్డ్‌, ఓర్వకల్లు వ్యవసాయాధికారి మధుమతి, సీ. బెళగల్‌ వ్యవసాయాధికారి మల్లేష్‌ కుమార్‌ కర్నూలు డివిజనలోని డీలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి వర లక్ష్మి మాట్లాడుతూ విత్తనాలు, ఎరువులను ఎమ్మార్పీకే విక్రయిం చాలన్నారు. విత్తనాలు, ఎరువులు, స్టాక్‌ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని, బిల్‌బుక్‌లు, ఈపాస్‌ విక్రయాల నమోదు రికా ర్డులను సరిగ్గా నిర్వహించాలని అన్నారు. డీబీటీ నమోదు చేసిన వివరాలు రైతులకు జారీ చేసిన బిల్లులు ఒకే విధంగా వివరాలు ఉండాలని డీలర్లను ఆదేశించారు. అనధికార సేల్స్‌ చేయరాదని, అంతర్రాష్ట్ర ఎరువుల రవాణాను నిషేధించినట్లు తెలిపారు. అధిక మోతాదులో యూరియా వినియోగించకుండా రైతులకు సూచన లు ఇవ్వాలని అన్నారు.

Updated Date - May 21 , 2026 | 12:16 AM