హోరాహోరీగా ఫెన్సింగ్ పోటీలు
ABN , Publish Date - Nov 22 , 2026 | 12:14 AM
నంద్యాలలో పద్మావతి నగర్‌లో ఉన్న ఇండోర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెన్సింగ్ ండర్ 17 విభాగంలో పోటీలు రెండో రోజు శనివారం హోరాహోరీగా సాగుతున్నాయి.
నంద్యాల హాస్పిటల్, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): నంద్యాలలో పద్మావతి నగర్‌లో ఉన్న ఇండోర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెన్సింగ్ ండర్ 17 విభాగంలో పోటీలు రెండో రోజు శనివారం హోరాహోరీగా సాగుతున్నాయి. నెల్లూరు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రీడాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిర్వాహకులు క్రీడాకారులకు భోజన వసతి కల్పించారు. శనివారం అండర్ - 17 టీమ్ విభాగంలో గెలుపొందిన విజేతలకు డోన్ డిప్యూటీ డీఈవో వెంకట్రామిరెడ్డి మెడల్స్ ప్రదానం చేశారు. అలాగే జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులను జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి సుధాకర్ ప్రకటించారు.
విజేతలు వీరే:
అండర్-17 బాల బాలికల విభాగంలో విజేతలను స్కూల్ గేమ్స్ కార్యదర్శి సుధాకర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి కుమార్ ప్రకటించారు. బాలుర విభాగంలో ఈపి పోటీల్లో అనంతపురం గోల్డ్ మెడల్, కర్నూలు సిల్వర్, గుంటూరు, పశ్చిమ గోదావరి జట్లు బ్రాంజ్ మెడల్స్ సాధించాయి. సాబరే పోటీల్లో గుంటూరు ప్రథమ స్థానం, చిత్తూరు ద్వితీయ స్థానం, అనంతపురం, తూర్పు గోదావరి జట్లు తృతీయ స్థానం సాధించాయి. ఫాయిల్ విభాగంలో పశ్చిమ గోదావరి బంగారు పతకం, చిత్తూరు వెండి పతకం, తూర్పు గోదావరి, విజయనగరం కాంస్య పతకాలు సాధించాయి.
బాలికల విభాగంలో..
ఈపి పోటీల్లో కర్నూలు గోల్డ్ మెడల్, చిత్తూరు సిల్వర్ మెడల్, అనంతపురం, గుంటూరు జట్లు బ్రాంజ్ మెడల్ సాధించాయి. సాబరే పోటీల్లో తూర్పు గోదావరి ప్రథమ స్థానం, కర్నూలు ద్వితీయ స్థానం, కడప, అనంతపురం తృతీయ స్థానాలు సాధించాయి. ఫాయిల్ విభాగంలో పశ్చిమ గోదావరి బంగారు పతకం, అనంతపురం వెండి పతకం, తూర్పు గోదావరి, కర్నూలు కాంస్య పతకం సాధించింది.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
అండర్ - 17 బాలికల విభాగంలో సాబరే పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులను జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి శశికళ ప్రకటించారు. జాతీయ స్థాయి పోటీలకు జె. సాత్రిక (కర్నూలు), వి. సూర్య (గుంటూరు), డి. లిఖిత (కడప), ఎం. మౌనిక (తూర్పు గోదావరి) ఎంపికయ్యారు. స్టాండ్ బైలుగా బి.భావన (విశాఖపట్నం), ఎ.దివ్య (శ్రీకాకుళం) ఎంపికయ్యారు.