మహిళా కండక్టర్ నిజాయితీ
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:28 AM
: మహిళా కండక్టర్ కేబి సౌజన్య నిజాయతీతో ఓ ప్రాణికుడు బస్సులో మరిచిపోయిన ల్యాప్‌టాప్, ఇతర వస్తువులను అందించారు
పోగొట్టుకున్న ల్యాప్‌టాప్ ప్రయాణికుడి అందజేత
ఆళ్లగడ్డ, జూన్4(ఆంధ్రజ్యోతి): మహిళా కండక్టర్ కేబి సౌజన్య నిజాయతీతో ఓ ప్రాణికుడు బస్సులో మరిచిపోయిన ల్యాప్‌టాప్, ఇతర వస్తువులను అందించారు. వివరాల మేరకు.. బుధవారం అహోబిలం నుంచి ఆళ్లగడ్డకు వస్తున్న బస్సులో వెంకటాద్రి అనే ప్రయాణికుడు ల్యాప్‌ట్యాప్ ఇతర విలువైన వస్తువులు బస్సులో మరిచిపోయారు. సీటులో ఉన్న ల్యాప్‌టాప్, వస్తులను కండక్టర్ గమనించి డీఎం సుబ్రహ్మణ్యంకు అందజేశారు. గురువారం డీఎం వివరాలు తెలుసుకుని ప్రయాణికుడికి ఎన్‌ఎంయూ నాయకుల సమక్షంలో అందజేశారు. కండక్టర్‌ను డీఎంతో పాటు యూనియన్ నాయకులు అభినందించారు.